Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్‌ను ఔట్ చేయడం ఎలానో నాకు తెలుసు: జోఫ్రా ఆర్చర్

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ‌ని ఔట్ చేయడం ఎలానో తనకు తెలుసని, కానీ ఆ సీక్రెట్‌ను ఇప్పుడే చెప్పనని ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాతే వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలో చెబుతానన్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న అతన్ని.. వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చాడు.

IPL 2026 Jofra Archer Drops a Cryptic Reply on How to Stop RR s Teenage Sensation Vaibhav Sooryavanshi
Photo Credit: screen grab for JioHotstar

'వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు నేను ఫిదా అయ్యాను. అతను ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేసుకోవడానికి అన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. తప్పకుండా 150+ మార్క్‌ను అందుకొంటాడు. చాలా మంది వైభవ్‌ సూర్యవంశీని ఎలా కట్టడి చేయాలని అడుగుతున్నారు. అయితే దానికి సమాధానం ఇప్పుడే చెప్పను. ఈ సీజన్ ముగిసిన తర్వాత చెబుతా.'అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు. వైభవ్‌ సూర్యవంశీతో జోఫ్రా ఆర్చర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడు. ఈ క్రమంలోనే అతని బలహీనత తనకు తెలుసని, సీజన్ ముగిసిన తర్వాత చెబుతానని వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీ కచ్చితమైన యార్కర్లకు మాత్రమే ఇబ్బంది పడుతాడు. ఆరంభంలో అతనికి బౌండరీలు ఇవ్వకుండా ఒత్తిడి పెంచితే ఔటవుతాడు. అతను రాంగ్ షాట్ ఆడేలా బౌలర్లు బౌలింగ్ చేయాలి. లేదంటే ఉప్పెనలా విరుచుకుపడి మ్యాచ్‌ను ఏకపక్షం చేస్తాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ కచ్చితమైన యార్కర్లు వేయలేక మూల్యం చెల్లించుకున్నాడు. బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకున్న బుడ్డోడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

Story first published: Thursday, May 28, 2026, 16:42 [IST]
Other articles published on May 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+