Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: మలుపు తిప్పిన ఆర్చర్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, రవి బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది.

211 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(4/41) నాలుగు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించాడు. నండ్రే బర్గర్, రియాన్ పరాగ్‌కు చెరో వికెట్ దక్కింది.

IPL 2026 Archer and Deshpande s Lethal Death-Over Spell Acts as the Ultimate Turning Point in RR s Narrow Win Over GT

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), ధ్రువ్ జురెల్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

మలుపు తిప్పిన జోఫ్రా ఆర్చర్..

161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్(24), కగిసో రబడా(23 నాటౌట్) దూకుడైన బ్యాటింగ్‌తో ఆశలు రేపారు. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఓ దశలో గుజరాత్ టైటాన్స్ విజయం లాంఛనం అనిపించింది. కానీ 19వ ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ కట్టడిగా బౌలింగ్ చేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్‌ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌వైపు టర్న్ చేసింది.

ఆఖరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. వైడ్‌తో ఈ ఓవర్ ప్రారంభించిన తుషార్ దేశ్‌పాండే తర్వాతి 6 బంతులకు మూడు పరుగులే ఇచ్చి రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది. కచ్చితమైన యార్కర్లతో రషీద్ ఖాన్, రబాడను బోల్తా కొట్టించాడు.

Story first published: Saturday, April 4, 2026, 23:39 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+