వారు జట్టులో ఉండటం మా అదృష్టం: జితేష్ శర్మ
ఎంతో అనుభవం కలిగిన భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ జట్టులో ఉండటం తమ అదృష్టమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తాత్కలిక కెప్టెన్ జితేష్ శర్మ అన్నాడు. వారి కారణంగా కెప్టెన్‌గా తన పని సులువైందని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా దూరం కావడంతో జితేష్ శర్మ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు. విజయానంతరం మాట్లాడిన జితేష్ శర్మ.. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించామని తెలిపాడు.
పూర్తి ఆధిపత్యం చెలాయించాం..
'ఈ మ్యాచ్ మొత్తం మా నియంత్రణలోనే ఉంది. ఏ దశలోనూ మాపై ఒత్తిడి కలగలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో మేం ఆధిపత్యం చెలాయించాం. బోర్డుపై 222 పరుగులు ఉంచడంతో చాలా ప్రశాంతంగా బౌలింగ్ చేశాం. ఈ వికెట్‌పై ఎలా బౌలింగ్ చేయాలో మాకు తెలుసు. ఎందుకంటే మేం ముందుగా బ్యాటింగ్ చేశాం కాబట్టి పిచ్ ఎలా స్పందిస్తుందో అర్థమైంది. మా బ్యాటర్ల ఫీడ్ బ్యాక్‌ను బట్టి అప్పటికప్పుడు మా బౌలింగ్ ప్రణాళికలను రచించాం. వాటిని సరిగ్గా అమలు చేశాం.

కెప్టెన్‌గా జట్టును నడిపించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా బాధ్యతలో ఒక భాగం. మేనేజ్‌మెంట్ నాకు ఏ బాధ్యత అప్పగించినా.. దానికి నా వంద శాతం శ్రమను అందిస్తాను. అనుభవం కలిగిన బౌలర్లు ఆర్‌సీబీ జట్టులో ఉండటం మా అదృష్టం. కెప్టెన్‌గా నాకు సీనియర్ ఆటగాళ్లు అండగా నిలవడం గొప్ప అనుభవం. గతంలో ఆర్‌సీబీకి వ్యతిరేకంగా కెప్టెన్సీ చేసి.. ఇప్పుడే అదే జట్టును నడిపించడం ప్రత్యేకమైన అనుభూతి.
తదుపరి మ్యాచ్‌కు రజత్ పాటిదార్..
మా కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు. మా ఆర్‌సీబీ నినాదం ఒక్కటే.. ఎక్కువగా ఆలోచించకుండా ప్రతీ మ్యాచ్‌పై ఫోకస్ పెట్టడమే. ప్రతీ మ్యాచ్‌లోనూ అత్యుత్తమ క్రికెట్ ఆడాలనేదే మా లక్ష్యం.' అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications