అందుకే హార్దిక్ పాండ్యా, సూర్యను పక్కనపెట్టాం: జస్‌ప్రీత్ బుమ్రా
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి రాకపోవడంతోనే తాను జట్టును నడిపిస్తున్నానని టాస్ సందర్భంగా జస్‌ప్రీత్ బుమ్రా తెలిపాడు.
వ్యక్తిగత కారణాలతో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, హార్దిక్ పాండ్యా గురించి సమాచారం లేదని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
19 ఏళ్ల వయసులో చేరాను..
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత మ్యాచ్‌ను పరిశీలించాం. వాతావరణం చల్లగా ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది. బంతి ముద్దుగా బ్యాట్‌పైకి వచ్చింది. ముంబై ఇండియన్స్‌కు తొలిసారి సారథ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. 19 ఏళ్ల వయసులో ఈ జట్టులో చేరాను. నేను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ అవ్వకముందే టీమిండియా టెస్ట్ టీమ్‌కు సారథ్యం వహిస్తానని అస్సలు ఊహించలేదు.

కెప్టెన్‌గా బాధ్యత తీసుకోవడం అంటే నాకు ఇష్టం. ఇదొక కొత్త సవాల్. ఈ కెప్టెన్సీని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను. ఈ సీజన్ మాకు చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ సవాళ్లు ఏదో నేర్పించడానికి ఎదురయ్యాయని అర్థం. ఈ ఓటములను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఈ తప్పిదాల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను.
సూర్య ఆడటం లేదు..
అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో సానుకూలంగా ఉంటూ మంచి క్రికెట్ ఆడే ప్రయత్నం చేస్తాం. మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మా ఆటను మేం ఆస్వాదించాలనుకుంటున్నాం. మా జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల సూర్య అందుబాటులో లేదు. అల్లా ఘజన్‌ఫర్ కూడా ఆడటం లేదు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌కు ధర్మశాల టికెట్స్ బుక్ చేసినా వారు ఇక్కడికి చేరుకోలేదని క్రిక్ బజ్ పేర్కొంది.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ పిచ్‌పై 210 ప్లస్ రన్స్ చేయాలన్నాడు. గతం గురించి ఆలోచించడం అనవసరమని చెప్పిన శ్రేయస్ అయ్యర్.. సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగడం ముఖ్యమన్నాడు. తుది జట్టులో మార్పులు చేశామని, హర్‌ప్రీత్ బ్రార్, గ్జేవియర్ బార్ట్‌లెట్, అజ్మతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి వచ్చారని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

