Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. కెప్టెన్‌గా తొలి విజయం: బుమ్రా

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం సంతోషంగా ఉందని ఆ జట్టు స్టార్ బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్ అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ దూరం కావడంతో బుమ్రా తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు. 'ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గెలవడం సంతోషంగా ఉంది. అయితే ఇది అద్భుతమైన క్రికెట్ మ్యాచ్. రెండు జట్లు కూడా అద్భుతంగా ఆడాయి. మంచి ఆరంభం తర్వాత మేం మ్యాచ్‌ను మా వైపుకు తిప్పుకున్నాం. చివర్లో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం నష్టం చేసింది. కానీ ప్రస్తుత క్రికెట్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టంగా మారుతోంది(నవ్వుతూ).

ఇక్కడ జరిగిన గత మ్యాచ్ ఆధారంగా కొన్ని ప్రణాళికలు రూపొందించాం. కానీ గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ పిచ్ కొంచెం పొడిగా ఉంది. గత మ్యాచ్‌లో పిచ్‌లో వేగం ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. మేం బౌలింగ్ చేసే సమయంలో బంతి ఆగుతూ.. తక్కువ ఎత్తులో వచ్చింది. అప్పుడే వికెట్ గత మ్యాచ్ తరహాలో లేదనే విషయం అర్థమైంది. మా ప్రణాళికల పట్ల స్పష్టంగా ఉన్నాం.

IPL 2026 Jasprit Bumrah Credits Tilak Varma and Shardul Thakur for MI Thrilling Win Over PBKS
Photo Credit: screen grab for JioHotstar

పేస్ తగ్గించి, క్రాస్ సీమ్‌తో స్టంప్స్‌ను టార్గెట్ చేసే ప్లాన్ చేశాం. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే కీలకమని భావించాం. ఎందుకంటే ఎత్తు కారణంగా.. షార్ట్, ఫుల్ లెంగ్త్ డెలివరీలు వేస్తే బంతి గాలిలో ఎగిరిపోతుంది. దాంతో మంచి బంతి సిక్స్ పోయినా దానికే కట్టుబడి ఉన్నాం. బ్యాటర్లు పొరపాటు చేసేలా చూశాం. బౌలర్లందరికీ క్రెడిట్ దక్కుతుంది. వారు మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. ఒత్తిడిలోనూ నిలకడగా బౌలింగ్ చేశారు.

తిలక్ ఆడిన ఇన్నింగ్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేసిన తీరు ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఈ గెలుపు క్రెడిట్ ఈ ఇద్దరిదే. ముఖ్యంగా తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడినా.. ఇతరుల సహకారం అందకపోయినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించాడు. అలాగే విల్ జాక్స్ కూడా ప్రభావం చూపాడు. అందరూ రాణించడం సంతోషంగా ఉంది.

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఇది నా తొలి మ్యాచ్. నేను టెస్ట్, టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఇక మిగిలింది వన్డే క్రికెట్ మాత్రమే. కానీ అది జరుగుతుందని నేను అనుకోవడం లేదు (నవ్వుతూ). జోకులు పక్కన పెడితే.. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మంచి వాతావరణం, గొప్ప మైదానం.. నేను ఈ సమయాన్ని బాగా ఆస్వాదించాను.'అని జస్‌ప్రీత్ బుమ్రాచెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 15, 2026, 8:48 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+