SRH vs LSG: హాట్ డ్రెస్‌లో మెరిసిన ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్!
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రియురాలు, ప్రముఖ మోడల్ అదితి హుండియా సందడి చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హాజరైన అదితి హుండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతుగా స్టాండ్స్‌లో సందడి చేస్తూ అభిమానుల మనసులను గెలుచుకుంది.
బ్లూ డ్రెస్‌లో మెరిసిన అదితి హుండియా
బ్లూ డ్రెస్‌లో తళక్కుమన్న ఆమెను టీవీ కెమెరాలు పదే పదే చూపించాయి. వికెట్ పడ్డప్పుడు.. బుంగ మూతి పెట్టిన అదితి.. బౌండరీ బాదినప్పుడు ఎగిరి గంతేస్తూ తన హావభావాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్(1) విఫలమైనప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మ్యాచ్‌కే హైలైట్ అయ్యింది.
లక్నో చేతిలో ఓటమిని కూడా ఆమె తట్టుకోలేకపోయింది. చాలా నిరాశగా కనిపించింది. ఓవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. మరోవైపు అదితి హుండియా మైదానంలో హల్ ఛల్ చేశారు. టీవీ కెమెరాలు పదే పదే ఈ ఇద్దర్నే ఫోకస్ చేశాయి.

ఎవరీ అదితి హుండియా?
అదితి హుండియా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 2017లో ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా, 2018లో మిస్ దివా విజేతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో దాదాపు 3 లక్షలకు పైగా ఫాలోవర్లను దక్కించుకుంది.
గత కొన్నేళ్లుగా ఇషాన్ కిషన్, అదితి హుండియా డేటింగ్‌లో ఉన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఈ ఇద్దరు కలిసి మైదానంలో సందడి చేశారు. త్వరలోనే ఈ ఇద్దరి పెళ్లి అంటూ ఇషాన్ కిషన్ తాతయ్య మీడియాకు చెప్పినా.. ఈ వార్తలను అతని తల్లి ఖండించింది. త్వరలోనే ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్‌కు ఓటమి..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్ష్ దూబే(2/18) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications