KKR vs SRH: ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: ఇషాన్ కిషన్
ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఓపెనర్ల దూకుడైన ఆరంభంతో ఇతర బ్యాటర్ల పని సులువైందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 65 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. ఈ గెలుపు క్రెడిట్ ఓపెనర్లదేనని స్పష్టం చేశాడు. జట్టుగా గెలిచినా..తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగా లేనని చెప్పాడు.
ఆ ఇద్దరి విధ్వంసతోనే..
'నా ఆట తీరు పట్ల సంతోషంగా లేను. కానీ జట్టు చూపించిన అంకితభావం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను కోరుకున్నట్లే ప్రతీ ఒక్కరు రాణించారు. నిజం చెప్పాలంటే ఈ పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉంది. కానీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. వారి దూకుడైన బ్యాటింగ్ కారణంగా పవర్‌ప్లేలో మాకు లభించిన ఆరంభం ఈ మ్యాచ్‌ను ఈజీగా మార్చింది.

ఎందుకంటే దూకుడైన ఆరంభం కారణంగా ఇతర బ్యాటర్లకు సింగిల్స్ తీస్తూ పిచ్‌ను అర్థం చేసుకునే అవకాశం దక్కింది. ఓపెనర్లతో పాటు చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కూడా గొప్పగా ఆడాడు. ఇది టీమ్ విజయం. ఫిన్ అలెన్ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికి తెలుసు. కానీ అతను హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటవ్వడం మా అదృష్టం.
అతను ఔటవ్వడం మా అదృష్టం..
హర్ష్ దూబే తన దేశవాళీ జట్టు తరపున చాలా కాలంగా బాగా ఆడుతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతను ఒత్తిడికి లోనవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు. ఇక శివాంగ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది చిన్న మైదానం అయినప్పటికీ.. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను కోచ్‌లతో నిరంతరం టచ్‌లో ఉంటూ ఏది వర్కౌట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. రింకూ సింగ్ లాంటి ఆటగాడికి ఎంత ధైర్యంగా బౌలింగ్ చేశాడు.
ప్రతి మ్యాచ్‌లో మేం ఏయే విషయాల్లో వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకుంటున్నాం. ఫీల్డింగ్ విషయంలో మేం ఇంకా మెరుగుపడాలి. ఎక్స్‌ట్రాల రూపంలో 20 పరుగులు ఇవ్వడం కూడా సరికాదు. ఒక జట్టుగా మేం వీటిని మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తాం.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఏకపక్ష విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడారు.
అనంతరం కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించినా.. రింకూ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), ఫిన్ అలెన్(7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/21) మూడు వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/14), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్ష్‌దూబేకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications