For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: అతనే మా మ్యాచ్ విన్నర్: ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వారంతా సూపర్ ఫిట్‌గా ఉన్నారని, ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాడు. రజత్ పటీదార్ టాస్ గెలవడంతో ఆర్‌సీబీ అభిమానుల నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. దాంతో అభిమానులను ఉద్దేశించి రజత్ పటీదార్ ప్రత్యేకంగా మాట్లాడాడు. జెర్సీ‌పై రెండో స్టార్ కోసం తమ సాయశక్తులా కృషి చేస్తామని అభిమానులకు హామీ ఇచ్చాడు.

మళ్లీ మాదే విజయం..

'ఇది సీజన్ మొదటి మ్యాచ్ కాబట్టి వికెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. గత సీజన్ నుంచి మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మేము దేనినీ కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2026లో కూడా మేమే విజయం సాధిస్తాం. గాయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. అద్బుతమైన బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి.

ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉన్నారు. గాయపడిన ఆటగాళ్లను మెడికల్ స్టాఫ్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. మా ఫ్యాన్స్ చెప్పేది ఒక్కటే.. మాకు మద్దతు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మేం ఈసారి కూడా టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తాం. జాకోబ్ డఫ్పీ, అభినందన్ సింగ్ అరంగేట్రం చేస్తున్నారు.'అని రజత్ పటీదార్ పేర్కొన్నాడు.

IPL 2026 Ishan Kishan Hails One to Watch Salil Arora as SRH Faces RCB in Season Opener
Photo Credit: IPL (X)


అతనే మా మ్యాచ్ విన్నర్

మరోవైపు టాస్ ఓడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, పిచ్ తాజాగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఈ వికెట్‌పై ముందుగా బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా ఫరక్ పడదన్నాడు. తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రతీ ఒక్కరు మంచి టచ్‌లో ఉన్నారని చెప్పాడు. 'మేం టాస్ గెలిచి ఉంటే ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. కానీ వికెట్ తాజాగా కనిపిస్తోంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా వచ్చే సమస్య ఏం లేదు. నైపుణ్యాలపై నమ్మకం ఉండాలి. ఇది ఐపీఎల్ కాబట్టి ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లందరికీ ప్రణాళికలపై స్పష్టత ఉంది, వాటిని సరిగ్గా అమలు చేయడమే మా లక్ష్యం.

ప్యాట్ కమిన్స్ మా జట్టులోనే కాకుండా ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. అతను లేకపోవడం పెద్ద లోటే. కానీ ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మా ప్లాన్స్‌ని అమలు చేయడంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మేం అది చేయగలిగితే, ఖచ్చితంగా గెలిచే జట్టుగా నిలుస్తాం. ఈ మ్యాచ్‌లో సలీల్ అరోరాపై అందరి ఫోకస్ ఉందని అనుకుంటున్నాను. అతను చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను కేవలం బంతిని గమనిస్తూ తన సహజ సిద్ధమైన ఆటను ఆడాలని నేను కోరుకుంటున్నా'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

Story first published: Saturday, March 28, 2026, 19:28 [IST]
Other articles published on Mar 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+