Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దమ్ముంటే నన్ను ఔట్ చేయండి: ఇషాన్ కిషన్ ఎచ్చిడి

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) దుమ్మురేపుతోంది. లీగ్‌లో ఏడో విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం ఉప్పల్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ సీజన్ తొలి ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. తాజా ఓటమితో వరుసగా మూడు పరాజయాలను మూటగట్టుకుంది. ఈ వరుస ఓటములను పంజాబ్ కింగ్స్ కలవరపరుస్తుండగా.. పుండు మీద కారం చల్లినట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్-కెప్టెన్ ఇషాన్ కిషన్ వ్యంగ్య పోస్ట్‌తో ట్రోల్ చేశాడు.

దమ్ముంటే పట్టుకోండి..

ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్యాటింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. 'నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి’అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. తాజా మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌లను పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కూపర్ కానల్లి, శశాంక్ సింగ్, లాకీ ఫెర్గూసన్‌లు నేలపాలు చేశారు.

ఈ అవకాశాలతో అతను హాఫ్ సెంచరీతో చెలరేగి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు క్యాచ్‌లు వదిలేయడంపై ఇషాన్ కిషన్ వ్యంగ్యంగా స్పందించాడు.

ఆ క్యాచ్‌లే మా కొంపముంచాయి..

తమ పరాజయానికి క్యాచ్ డ్రాప్స్ ప్రధాన కారణమని మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మొదట్లోనే మేం కొన్ని క్యాచ్‌లు వదిలేశాం. అది మాపై తీవ్ర ప్రభావం చూపింది. పిచ్ నెమ్మదిస్తూ పోయింది. సన్‌రైజర్స్ అద్భుతమైన క్రికెట్ ఆడి, మ్యాచ్ ఎలా గెలవాలనేది మాకు చూపించింది. టోర్నమెంట్‌లో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అది మాకు ఏ మాత్రం సహాయపడదు.

Ishan Kishan Fires Shots at PBKS Fielders After Being Dropped Thrice in SRH Triumph

కూపర్ కానల్లి అసాధారణమైన ఆటగాడు. అతని ఆలోచనా తీరు టాప్‌లో ఉంటుంది. ఒత్తిడిలో భారీ పరుగులు చేయడంలో అతనికి సహజసిద్ధమైన ప్రతిభ ఉంది. చాహల్ అద్భుతమైన బౌలర్. దురదృష్టవశాత్తు, మేం క్యాచ్‌లు అందుకోలేకపోయాం’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

పాపం కానల్లి

ఈ మ్యాచ్‌లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 38), అభిషేక్ శర్మ( 13 బంతుల్లో 35 పరుగులు )అదిరిపోయే ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (43 బంతుల్లో 69), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 55) మెరుపు అర్ధసెంచరీలతో సత్తా చాటారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులే చేసి ఓటమిపాలైంది. కూపర్ కానల్లీ(59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 107) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్, పాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగా, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, May 7, 2026, 16:22 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+