Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: అతని కోసమే హర్షల్ పటేల్‌ను పక్కనపెట్టాం: ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. గాలీ వీస్తుండటంతో మంచు ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పలేమన్నాడు. వర్షం పడే అవకాశాలు ఉండటంతోనే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు.

మార్పుల్లేవ్..

'మేం ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఆటను మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. గత మ్యాచ్‌లో ఓడినా.. చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఇంత గడ్డిని చూడం. పైగా వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. అందుకే మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.

గాలి వీస్తున్నందున మంచు ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఈ పిచ్ 40 ఓవర్ల పాటు బాగానే సహకరిస్తుంది. కామెరూన్ గ్రీన్ చేయాల్సిందంతా చేస్తున్నాడు. త్వరలోనే బౌలింగ్ చేస్తాడు. మేం తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.

IPL 2026 Ishan Kishan Explains Harshal Patel s Absence as SRH Make Strategic Change Against KKR
Photo Credit: screen grab for JioHotstar

వికెట్ టేకింగ్ ఆప్షన్ కోసం..

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన ఇషాన్ కిషన్.. వికెట్ టేకింగ్ ఆప్షన్ కోసం శివాంగ్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకున్నామని పేర్కొన్నాడు. దాంతో హర్షల్ పటేల్‌ ఉద్వాసనకు గురయ్యాడని తెలిపాడు.

'టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. బంతిని గమనించి దానికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మేం మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలి. బేసిక్స్‌కు తగ్గట్లు ఆడుతూ మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలి. పరిస్థితులు ప్రతికూలంగా మారినా ప్రశాంతంగా ఉండాలి.

ఈ మ్యాచ్‌లో మేం ఆటను సింపుల్‌గా ఉంచాలని అనుకుంటున్నాం. ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ ఎప్పుడా అనేది నాకు తెలియదు. కానీ అతను త్వరలోనే అందుబాటులోకి వస్తాడు. అతను జట్టులోకి వస్తే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. మా తుది జట్టులో ఒక మార్పు చేశాం. వికెట్ టేకింగ్ ఆప్షన్ కోసంశివాంగ్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం. అతను నెట్స్‌లో బాగా బౌలింగ్ చేశాడు.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. శివాంగ్ కుమార్ కోసం ఎషాన్ మలింగా, హర్షల్ పటేల్‌లను ఇంపాక్ట్ సబ్ లిస్ట్‌లో చేర్చారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్.

కోల్‌కతా నైట్ రైడర్స్:

అజింక్య రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబానీ.

Story first published: Thursday, April 2, 2026, 19:31 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+