ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు కీలక మార్పులతో బరిలోకి దిగింది. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. జయదేవ్ ఉనాత్క్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడని చెప్పిన ఇషాన్ కిషన్.. లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ అరోరా వచ్చాడని తెలిపాడు. ప్రఫుల్ హింగేకు అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరోక్షంగా వెల్లడించాడు.
'మేం కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. కానీ, వికెట్ చూడటానికి చాలా హార్డ్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. ప్యాట్ కమిన్స్ వంటి ఆటగాడు లేకపోవడం ఏ0 జట్టుకైనా పెద్ద లోటే. ఎందుకంటే అతను అద్భుతమైన బౌలర్, ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు.

అయినప్పటికీ, మా జట్టులోయువ ఆటగాళ్లు ఉన్నారు. మేం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. అదే టీ20 క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన విషయం. మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ అరోరా ఆడుతుండగా..జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడు.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డే గేమ్ కావడంతో పిచ్ గురించి తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. గత రెండు మ్యాచ్‌లుగా తాము అదే చేసి ఫలితం రాబట్టామని వెల్లడించాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. గత మ్యాచ్‌ల తరహాలోనే సమష్టిగా రాణించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ.