IPL 2026: మలుపు తిప్పిన భాగస్వామ్యం.. SRH ఘన విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ శతకం వృథా అయ్యింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది ఐదో విజయం కాగా.. రాజస్థాన్ రాయల్స్‌కు మూడో ఓటమి. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు రెండింటిలోనూ రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. లోయారర్డర్ బ్యాటింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్ రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఇచ్చిన సునాయస క్యాచ్‌లను రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్లు వదిలేసారు.

శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 103) విధ్వంసకర శతకానికి తోడుగా ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/38) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగేలు తలో వికెట్ తీసారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), అభిషేక్ శర్మ(29 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 57) విధ్వంసకర అర్ధ శతకాలతో చెలరేగగా.. నితీష్ కుమార్ రెడ్డి(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. డొనోవన్ ఫెర్రీరా ఒక వికెట్ తీసాడు.
మలుపు తిప్పిన భాగస్వామ్యం..
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ ఔటవ్వగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడి పవర్ ప్లేలో భారీ స్కోర్ అందించడంతో పాటు రెండో వికెట్‌కు 132 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ లక్స్య ఛేదన ఈజీ అయ్యింది. తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ తమదైన శైలిలో చెలరేగి జట్టును వియం ముంగిట నిలబెట్టారు.
సన్‌రైజర్స్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు వదిలేసారు. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొచ్చింది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ లోయరార్డర్ బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ ధాటికి ఓ దశలో రాజస్థాన్ రాయల్స్ 250+ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని రాజస్థాన్‌ను 230లోపు కట్టడి చేశారు. ముఖ్యంగా ప్రఫుల్ హింగే ఆఖరి ఓవర్‌లో ఒక వికెట్ తీసి రాజస్థాన్ పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications