IPL 2026: ముంబై, CSK ను ఎగతాళి చేసిన కృనాల్ పాండ్యా..?(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి రెండో టైటిల్‌ను ముద్దాడింది. విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
వరుసగా రెండు టైటిల్స్ గెలవడంతో ఆర్‌సీబీ ప్లేయర్స్ ఎగిరి గంతేసారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా కాస్త ఎక్కువగానే సెలెబ్రేట్ చేసుకున్నాడు. తన కొడుకు, సతీమణితో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే ఆర్‌సీబీ ఆటగాళ్లంతా ట్రోఫీతో ఫొజిచ్చే సమయంలో కృనాల్ పాండ్యా చేసిన సైగలు ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ఆర్‌సీబీ ఆటగాళ్లంతా రెండు టైటిల్స్ గెలిచామనే ఉద్దేశంతో రెండు వేళ్లతో సైగలు చేస్తే.. కృనాల్ పాండ్యా మాత్రం ఐదు వేల్లతో చేతిని చూపించాడు. అతను అలా ఐదు చూపించడం చూసి అవాక్కైన కోహ్లీ, రజత్ పాటిదార్ రెండే బ్రో అని చెప్పారు. అయినా కృనాల్ ఐదు వేళ్లను చూపిస్తూ.. సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ను కృనాల్ పాండ్యా ఎగతాళి చేశాడని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేశారు. వాస్తవానికి ఇందులో నిజం లేదు. కృనాల్ పాండ్యా ఏ జట్టును ఉద్దేశించి ఐదు వేళ్లతో సైగలు చేయలేదు. ఐపీఎల్‌లో అతనికి ఇది ఐదో టైటిల్. ముంబై ఇండియన్స్ తరఫున మూడు టైటిళ్లు గెలిచిన అతను.. ఆర్‌సీబీలో వరుసగా రెండు టైటిళ్లు అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఐదు వేళ్లతో సైగలు చేశాడు.
ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ పాండ్యా 226 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై ఇండియన్స్ గెలిచిన ఐపీఎల్ 2017, 2019, 2020 ట్రోఫీల్లో కృనాల్ పాండ్యా భాగంగా ఉన్నాడు. తాజా సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ పాండ్యా 226 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
