IPL 2026: ముంబై ఇండియన్స్ చేతిలో 5 జట్ల భవితవ్యం..!
ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. ఇప్పటికే మూడు బెర్త్‌లను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు ఎక్కువ అవకాశాలు ఉండగా.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సమాన అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అదృష్టాన్ని నమ్ముకున్నాయి.
అయితే 'మాయల ఫకీరు' ప్రాణ రహస్యం చిలక గూటిలో ఉన్నట్లు.. ఇప్పుడు ఈ ఐదు జట్ల భవితవ్యం ముంబై ఇండియన్స్ చేతిలో ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అందరికన్నా ముందే ఇంటి బాట పట్టినా.. ఇప్పుడు కింగ్ మేకర్‌గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ చేరే జట్టు ఏంటా? అనేది తెలిపోనుంది.

రాజస్థాన్ రాయల్స్ ఓడితేనే..
13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు 14 పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో తమ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో ముందడుగు వేస్తోంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 16 పాయింట్స్‌తో ఏ జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడితే పంజాబ్ కింగ్స్(లక్నోపై గెలిస్తే), చెన్నై సూపర్ కింగ్స్(గుజరాత్ టైటాన్స్‌పై గెలిస్తే), కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తాయి. దాంతోనే ముంబై ఇండియన్స్ ఇప్పుడు కింగ్ మేకర్‌గా మారింది.
పంజాబ్, కేకేఆర్ గెలిస్తేనే..
లక్నోసూపర్ జెయింట్స్‌పై తమ ఆఖరి లీగ్ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ ఖాతాలో 15 పాయింట్స్ చేరుతాయి. కేకేఆర్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడిస్తే 15 పాయింట్స్‌తో పంజాబ్ కింగ్స్‌తో సమంగా నిలుస్తోంది. అప్పుడు నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది.
అలా కాకుండా పంజాబ్ లక్నో చేతిలో, ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడితే.. 13 పాయింట్లతో రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి. చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ గెలిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌ను ఓడిస్తే.. రాజస్థాన్ రాయల్స్(ముంబై చేతిలో ఓడితే)తో సమంగా 14 పాయింట్స్‌తో నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఇక నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications