IPL 2026 ఛాంపియన్‌గా ఆర్‌సీబీ.. SRH కు నో ఛాన్స్! ఇదీ లెక్క!!
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరింది. 70 లీగ్ మ్యాచ్‌లు ముగిసాయి. మరో వారం రోజుల్లో 19వ ఎడిషన్ ఐపీఎల్ విజేత ఎవరో తేలనుంది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా..ఆదివారం జరిగే ఫైనల్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) పాయింట్స్ టేబుల్‌లో వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ నాలుగు జట్లు ఇప్పటికే ఒక్కో టైటిల్ గెలుచుకున్నాయి. రెండో టైటిల్‌పై కన్నేసాయి.
క్వాలిఫైయర్-1 టీమ్స్‌కే ఛాన్స్..
మంగళవారం(మే 26) ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన టీమ్‌కు క్వాలిఫైయర్-2 రూపంలో మరో అవకాశం లభిస్తుంది.
అయితే ఈ రెండు జట్లు టైటిల్‌ను గెలుచుకోవడానికి ప్రధాన ఫేవరెట్స్‌గా ఉన్నాయి. గత చరిత్ర చూసుకున్నా.. సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకున్నా ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌లకు టైటిల్ గెలుచుకునేందుకు 93.3 శాతం అవకాశాం ఉంది.

SRH కు నో ఛాన్స్
బుధవారం(మే 27) న్యూ చండీగఢ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ లెక్కన సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఈ రెండు జట్లలో ఒక టీమ్ టైటిల్ గెలవాలంటే గత 10 ఏళ్లలో జరగని అద్భుతం జరగాలి.
15 సీజన్లలో 14 సార్లు..
ఐపీఎల్ 2011లో తొలిసారి ప్లేఆఫ్స్ విధానం ప్రవేశం పెట్టగా.. అప్పటి నుంచి గత 15 సీజన్లలో 14 సార్లు (93.3%) క్వాలిఫైయర్-1 ఆడిన జట్లలోని ఒక టీమ్ మాత్రమే విజేతగా నిలిచింది. ఒకే ఒక్కసారి మాత్రమే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన జట్టు టైటిల్ అందుకుంది. అయితే ఆ రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది. ఐపీఎల్ 2016లో ఎలిమినేటర్‌లో కేకేఆర్‌ను ఓడించిన సన్‌రైజర్స్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్, ఫైనల్లో ఆర్‌సీబీని మట్టికరిపించి తొలి టైటిల్ ముద్దాడింది. మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆరెంజ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో మొదటి క్వాలిఫైయర్‌లో ఆడిన జట్లు 15 సీజన్లలో 12 సార్లు ఫైనల్‌కు చేరాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్/ ఢిల్లీక్యాపిటల్స్ (2012, 2021), గుజరాత్ లయన్స్ (2026) మాత్రమే ఫైనల్ చేరలేదు. అంతేకాకుండా.. తొలి క్వాలిఫైయర్‌ను గెలిచిన జట్టు కూడా 15 సీజన్లలో 12 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ (2013, 2017), సన్‌రైజర్స్ హైదరాబాద్(2016) మాత్రమే క్వాలిఫయర్-2 ఆడి టైటిల్ అందుకున్నాయి. ఈ గణాంకాలు RCB, GTలకు బలమైన విజయావకాశాలను సూచిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications