SRH vs PBKS: కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) దూకుడుగా ఆడాడు.
పవర్ ప్లేలోనే 105 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 250 ప్లస్ రన్స్ చేసేలా కనిపించింది. కానీ పవర్ ప్లే అనంతరం పార్ట్‌టైమ్ బౌలర్ శశాంక్ సింగ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వెనువెంటనే ఔటవ్వడంతో సన్‌రైజర్స్ జోరుకు బ్రేకులు పడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడినా.. హెన్రీచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ కొంపముంచాడు. 33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 39 పరుగులే చేశాడు. పిచ్ స్లోగా ఉండటంతో క్లాసెన్ వేగంగా పరుగులు చేశాడు.

మరోవైపు దూకుడుగా ఆడిన అనికేత్ వర్మ(18) రనౌట్‌కు క్లాసెన్ కారణమయ్యాడు. ఒక ఫోర్, సిక్సర్‌తో దూకుడు కనబర్చిన అనికేత్ వర్మ.. క్లాసెన్ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనికేత్ వర్మ వద్దని చెబుతున్నా.. లేని పరుగుకు క్లాసెన్ ప్రయత్నించాడు. ఆ తర్వాత వచ్చిన సలీల్ అరోరా(9) విఫలమవ్వడంతో సన్‌రైజర్స్ 219 పరుగులే చేయగలిగింది. పవర్ ప్లేలోనే 105 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్..తర్వాతి 14 ఓవర్లలో 114 పరుగులే చేసింది.
చివరి 5 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 37 పరుగులే చేయడం గమనార్హం. జేవియర్ బార్ట్‌లెట్ వేసిన ఆఖరి ఓవర్‌లో క్లాసెన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఔటైన అనంతరం తన బ్యాట్‌ను గాల్లోకి విసిరేస్తూ అసహనం వ్యక్తం చేశాడు.
హెన్రీచ్ క్లాసెన్ కాస్త దూకుడుగా ఆడి ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 20 పరుగులు అదనంగా చేసి ఉండేది. బలహీనంగా ఉన్న బౌలింగ్ లైనప్‌కు మరింత బలం చేకూరేది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్‌కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications