For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs SRH: ఔటా? నాటౌటా? అంపైర్‌తో క్లాసెన్ వాగ్వాదం! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ ఆగ్రహానికి గురయ్యాడు. తన క్యాచ్‌ను థర్డ్‌ అంపైర్‌ మెరుగైన యాంగిల్స్‌లో చెక్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో హెన్రీచ్ క్లాసెన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 పరుగులతో మెరుగ్గా ఆడాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. కానీ రొమారియో షెఫెర్డ్ వేసిన 14వ ఓవర్‌లో ఫిల్ సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్‌కు క్లాసెన్ ఔటయ్యాడు. రొమారియో వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీని క్లాసెన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్‌పై సాల్ట్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు.

IPL 2026 Heinrich Klaasen Fumes at Third Umpire Over Phil Salt s Contentious Catch in RCB vs SRH
Photo Credit: screen grab for JioHotstar

అయితే అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు అనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలు యాంగిల్స్‌లో రివ్యూలను పరిశీలించారు. ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్‌ను తాకకపోవడంతో ఔటిచ్చారు. అయితే ఒక యాంగిల్‌లో అతని శరీరం బౌండరీకి తాకినట్లు అనిపించింది. కానీ మరో యాంగిల్‌లో మాత్రం ఔట్‌గా తేలింది. దాంతో ఈ క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హెన్రీచ్ క్లాసెన్ కూడా అంపైర్‌తో ఇదే విషయాన్ని చర్చించాడు. మరిన్ని మెరుగైన యాంగిల్స్‌లో పరీక్షించవచ్చు కదా? అని అసహనం వ్యక్తం చేస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఏది ఏమైనా ఫిల్ సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43), హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకో డఫీ(3/22), రొమారియో షెఫెర్డ్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, March 28, 2026, 22:16 [IST]
Other articles published on Mar 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+