Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: కాస్లెన్, నితీష్ రెడ్డి ఊచకోత..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ బ్యాటర్లు హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును 116 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు.

దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.

చేతులెత్తేసిన టాపార్డర్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్‌ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) ఔటవ్వగా.. నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌(1)ను ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 11 పరుగులకే సన్‌రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్‌, క్లాసెస్ ఆచితూచి ఆడారు.

దాంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసింది. ఆ వెంటనే లివింగ్ స్టోన్(14) దిగ్వేష్ రతీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.

IPL 2026 Heinrich Klaasen and Nitish Reddy Resurrect SRH to 156 9 After Early Collapse vs LSG

10 ఓవర్లకు 35..

హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా డిఫెన్స్‌కే పరిమితం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 35 పరుగులే చేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి జట్టును ఆదుకున్నారు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. దూకుడైన బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లపై విరుచుకుపడింది.

ప్రిన్స్ యాదవ్ వేసిన 11వ ఓవర్‌లో నితీష్ రెడ్డి, క్లాసెన్ చెరో సిక్సర్ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. దిగ్వేష్ రతీ బౌలింగ్‌లో నితీష్ రెడ్డి రెండు బౌండరీలు బాదగా.. సిద్దార్థ్ బౌలింగ్‌లో క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్‌ మిడ్ వికెట్‌లో ముకుల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు.

హాఫ్ సెంచరీలు బాదిన నితీష్, క్లాసెన్..

ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లాసెన్ నాలుగు బౌండరీలు బాది 19 పరుగులు పిండుకున్నాడు. దిగ్వీష్ రతీవేసిన 15వ ఓవర్‌లో నితీష్ రెడ్డి మూడు భారీ సిక్స్‌లు బాదడంతో సన్‌రైజర్స్ 114 పరుగులకు చేరుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసిన 16వ ఓవర్‌లో సిక్స్‌తో పాటు సింగిల్ బాది క్లాసెన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆవేష్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్‌లో నితీష్ కుమార్ రెడ్డి సింగిల్ తీసి 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

అనంతరం దూకుడుగా ఆడిన అతను మరో భారీ సిక్సర్ బాదాడు. అయితే అతన్ని సిద్దార్థ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి ఐదో వికెట్‌కు నమోదైన 116 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో వినూత్న షాట్ ఆడబోయి క్లాసెన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

Story first published: Sunday, April 5, 2026, 17:31 [IST]
Other articles published on Apr 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+