ఐపీఎల్ 2026 సీజన్ టోర్నీని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్(7) పేలవంగా ప్రారంభించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషభ్ పంత్.. ఓ బౌండరీతో జోరు కనబర్చాడు. కానీ మిచెల్ మార్ష్ కొట్టిన ఓ షాట్ అతని రనౌట్‌కు దారి తీసింది.
బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది. అప్పటికే రిషభ్ పంత్ క్రీజు ధాటి ఉండటంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని మార్ష్ బౌలర్‌వైపు ఆడగా.. అతని చేతి వేలిని తాకుతూ స్టంప్స్‌ను పడేసింది.
దాంతో రిషభ్ పంత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన బ్యాడ్‌టైమ్‌ను నిందించుకుంటూ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. పంత్‌పై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. 'పాపం పంత్.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టం'అని కామెంట్ చేస్తున్నారు. పంత్ గాశారం బాలేదని అభిప్రాయపడుతున్నారు.

రిషభ్ పంత్ ఔటైన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(11)ను అక్షర్ పెవిలియన్ చేర్చాడు.
డేంజరస్ నికోలస్ పూరన్(8)ను ఎన్గిడి క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆయుష్ బదోని(0), అబ్దుల్ సమద్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36), మహమ్మద్ షమీ(1)లను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాజన్ మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.