Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పాపం బుడ్డోడు.. మళ్లీ వెంటాడిన దురదృష్టం!

రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96)ని మళ్లీ దురదృష్టం వెంటాడింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో ఈ 15 ఏళ్ల కుర్రాడు తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ 97 పరుగుల వద్దే ఔటై శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌లోనూ 96 పరుగులు చేసి వెనుదిరిగాడు.

శతకాన్ని అందుకోలేకపోయినా.. అద్వితయమైన బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ 215 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. వైభవ్‌తో పాటు రవీంద్ర జడేజా(45 నాటౌట్), డోనవన్ ఫెరీరా(38 నాటౌట్) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2026 Heartbreak Again for Vaibhav Sooryavanshi as He Misses Century but Powers RR to a Massive 214 Against GT in Qualifier 2

వరుసగా వికెట్లు కోల్పోయినా..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్(1) క్యాచ్ ఔటవ్వగా.. రబడా వేసిన రెండో ఓవర్‌లోనే ధ్రువ్ జురెల్(1) వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో జడేజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లకు 70 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. కెప్టెన్ రియాన్ పరాగ్(11), డసన్ షనక(3), జోఫ్రా ఆర్చర్(7) తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన జడేజా మళ్లీ బరిలోకి దిగాడు. అతనితో కలిసి చెలరేగిన వైభవ్ సూర్యవంశీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

హాఫ్ సెంచరీ అనంతరం గేర్ మార్చిన వైభవ్ సూర్యవంశీ..15 బంతుల్లోనే సెంచరీకి చేరువయ్యాడు. కానీ రబాడ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి మరోసారి 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ వెనుదిరిగినా..డోనవన్ ఫెరారీ(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38 నాటౌట్), రవీంద్ర జడేజా జట్టుకు 214 పరుగుల భారీ స్కోర్‌ను అందించారు.

Story first published: Friday, May 29, 2026, 21:56 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+