కోహ్లీ భయ్యా.. చాలా స్లోగా ఆడుతాడు: వైభవ్ సూర్యవంశీ (వీడియో)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడుతాడని టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెప్పినట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేతో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. అయితే ఈ వీడియో ఫేక్ అని హర్షా భోగ్లే సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. అసలు తాను వైభవ్ సూర్యవంశీని కోహ్లీ గురించి అడగలేదని, అతను కూడా వీడియోలో ఉన్నట్లుగా చెప్పలేదని స్పష్టం చేశాడు.
'సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఫేక్. అందులో వైభవ్‌ను మర్యాద తెలియనివాడిగా.. అహంకారిగా క్రియేట్ చేశారు. నేను అతడిని ఆ ప్రశ్న అడగలేదు. అతను కూడా అలాంటి సమాధానమేది చెప్పలేదు. చాలా క్రూరంగా, దురుద్దేశపూర్వకంగా ఈ వీడియో క్రియేట్ చేశారు. తనతో మాట్లాడిన కొద్దిమందితో చాలా గౌరవంగా మాట్లాడే ఒక చిన్న పిల్లాడి విషయంలో ఇలా ప్రవర్తించడం దారుణం.'అని హర్షా భోగ్లే ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

ఆ వీడియోలో ఏం ఉందంటే..?
'నువ్వు కూడా విరాట్ కోహ్లీలా క్రికెట్ ప్రపంచాన్ని ఓ రాజులా శాసించాలి అనుకుంటున్నావా? అని హర్షా భోగ్లే అడిగితే.. 'నాకు విరాట్ భయ్యా అంటే చాలా ఇష్టం. కానీ నాకు అతని రికార్డ్స్ నచ్చవు. అతను చాలా నెమ్మదిగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తాడు. దూకుడుగా ఆడలేడు.'అని వైభవ్ చెప్పినట్లుగా ఏఐ సాయంతో వీడియోను రూపొందించారు. దాంతో ఈ వీడియో నిజమేనని భావించిన నెటిజన్లు వైభవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్షా భోగ్లే క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుత ఏఐ యుగంలో ఏది నిజమో.. ఏది కల్పితమో తెలియని పరిస్థితి నెలకొందని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. కొందరు ఆకతాయిలు డీప్ ఫేక్ వీడియోలతో వారి పరువును బజారుకీడుస్తారు. ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం వైభవ్ సూర్యవంశీని విరాట్ కోహ్లీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. పలు విషయాలను చర్చించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications