Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే జస్‌ప్రీత్ బుమ్రాను పక్కనపెట్టాం: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు.

ఈ మ్యాచ్‌ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా‌కు విశ్రాంతి ఇచ్చామని చెప్పిన హార్దిక్ పాండ్యా.. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. సాయంత్రం అయ్యే కొద్దీ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించే అవకాశం ఉంది. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 29 లక్షల మంది ప్రజలకు సహాయం అందించి వారి జీవితాల్లో మార్పు తెచ్చారు.

ఆ చిన్నారుల కోసం గెలుస్తాం..

ఇందులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ప్రతి ఏడాది ఆ ఫౌండేషన్ కోసం ఒక మ్యాచ్ ఆడుతాం. పిల్లల సమక్షంలో జరిగే ఈ నిర్దిష్ట మ్యాచ్‌లో మైదానంలో వాతావరణం ఎంతో అద్భుతంగా, అత్యంత కోలాహలంగా ఉంటుంది. మేం కేవలం ఆ పిల్లల కోసం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. వారు ఇక్కడి నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్లేలా చూడాలనుకుంటున్నాం.

ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది. కానీ మేం దీనిని విజయంతో ముగించాలనుకుంటున్నాం. జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చాం. శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

IPL 2026 Hardik Pandya Reveals Reason Behind Jasprit Bumrah s Absence Against Rajasthan Royals

తప్పక గెలవాల్సిన మ్యాచ్..

మరోవైపు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. 'ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఈ సీజన్‌లో మేం మెరుగైన ప్రదర్శనలు చేశాం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మేం సాధించిన ప్రతి ఒక్కటి నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. మేం అందుకున్న ప్రశంసలు.. ఈ టోర్నీలో మేం పెట్టిన శ్రమ అంతా నిజమవ్వడానికి ఇదే సరైన సమయం.

సరైన అవకాశం అని నేను భావిస్తున్నా. ఈ రోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. మేం గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాం. ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. జట్టులో మూడు మార్పులు చేశాం - నండ్రే బర్గర్, రవీంద్ర జడేజా‌తో పాటు నేను బరిలోకి దిగుతున్నా.'అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ శనక, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, యష్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఏఎమ్ గజన్‌ఫర్, రఘు శర్మ.

Story first published: Sunday, May 24, 2026, 15:46 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+