Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్‌ శర్మ వల్లే ఈ ఓటమి: హార్దిక్ పాండ్యా

రోహిత్ శర్మతో పాటు టాప్-4 బ్యాటర్ల వైఫల్యం తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. బౌలింగ్‌లో 10-15 పరుగులు అదనంగా ఇచ్చినా.. ఛేదించాల్సిన లక్ష్యమేనని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ సీజన్‌ను ఘోర పరాజయంతో ముగించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే సాధించి 9వ స్థానంలో నిలిచింది.

పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయాం..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. పవర్ ప్లేలోనే చాలా వికెట్లు కోల్పోవడం విజయవకాశాలు దెబ్బతీసిందన్నాడు. 'బౌలింగ్‌లో మేం 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. ఈ రోజు వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. అయినప్పటికీ మా బౌలర్లు మంచి ప్రదర్శనే చేశారు. ఈ లక్ష్యం చేధించదగినదే. కానీ పవర్‌ప్లేలోనే మేం చాలా వికెట్లు కోల్పోయాం. దాంతో మ్యాచ్‌లో వెనుకబడి.. పుంజుకోవడానికే ప్రయత్నించాల్సి వచ్చింది.

IPL 2026 Hardik Pandya Blames Powerplay Batting Collapse and Death Overs Bowling for MI s Loss to RR
Photo Credit: screen grab for JioHotstar

నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు పిచ్ చాలా బాగుంది. బంతి బ్యాట్‌పైకి బాగా వచ్చింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పిచ్ ఒకేలా ప్రవర్తించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై మా బ్యాటర్లు మెరుగైన షాట్స్ ఆడాల్సింది.

డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH

డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH

5 ఓవర్లలో 73 పరుగులు..

డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే.. అయితే ఆ చివరి 5 ఓవర్ల వ్యవధిలో ఒకటి, రెండు బౌండరీలను అడ్డుకున్నా.. ప్రత్యర్థి స్కోర్‌ను 12-15 పరుగులు తగ్గించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మేం ఈ రోజు అలా చేయలేకపోయాం. చివరి 5 ఓవర్లలో మేం 73 పరుగులు సమర్పించుకోవడం కూడా మా ఓటమికి కారణమైంది.

నేను ఫిట్‌గానే ఉన్నాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాటు కెప్టెన్సీ కూడా చేస్తాను. కాబట్టి కాస్త అలసటతో మైదానంలో స్ట్రెచింగ్ చేశాను. ఈ మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి దాన్ని ఆస్వాదించే అవకాశం రావడం నాకు మంచిదే.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ డకౌట్..

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 205 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ 175 పరుగులే చేసింది. రోహిత్ శర్మ(0) డకౌట్ కాగా.. ర్యాన్ రికెల్టన్(12), నమన్ ధిర్(6), తిలక్ వర్మ(3) తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో ముంబై ఇండియన్స్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్(60) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది.

IPL 2026: ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్!

IPL 2026: ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్ రాయల్స్!
Story first published: Sunday, May 24, 2026, 21:17 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+