Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs KKR మ్యాచ్‌లో మెరిసిన గౌతమ్ గంభీర్.. సెలెక్టర్‌తో కలిసి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సందడి చేశాడు. టీమిండియా సెలెక్టర్ ఆర్‌పీ సింగ్‌తో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరయ్యాడు. తన పేరిట ఉన్న స్టాండ్స్‌లోని వీఐపీ బాక్స్‌లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి ఈ మ్యాచ్‌ను ఆస్వాదించాడు.

గౌతమ్ గంభీర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్ ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరవ్వడం ఇదే తొలిసారి. ఐపీఎల్ జరుగుతుండటంతో గంభీర్‌కు సుదీర్ఘ విరామం లభించింది. ఈ విశ్రాంతి సమయాన్ని గంభీర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నాడు.

IPL 2026 Gautam Gambhir Spotted with Selector RP Singh at DC vs KKR Clash in Delhi
Photo Credit: X (twitter)

ఉన్నట్లుండి గంభీర్ ఐపీఎల్ మ్యాచ్‌‌కు హాజరవ్వడంతో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. కేఎల్ రాహుల్ ఆటను దగ్గరుండి చూసేందుకే గంభీర్ ఈ మ్యాచ్‌కు హాజరయ్యాడని, సంజూ శాంసన్ స్థానంలో అతన్ని ఎంపిక చేయవచ్చని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం తన పాత ఫ్రాంచైజీ కేకేఆర్ ఆటను చూసేందుకు వచ్చాడని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం తన సొంతమైదానంలో వీఐపీ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా గంభీర్ రాక సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అషుతోష్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39), కేఎల్ రాహుల్(14 బంతుల్లో 4 ఫోర్లతో 23) విలువైన పరుగులు చేశారు.

కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Friday, May 8, 2026, 21:47 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+