Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓరి దేవుడా.. మాకే ఎందుకిలా..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది.

అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓవైపు మైదాన సిబ్బంది కవర్లు కప్పుతుండగా మరోవైపు ఆటగాళ్లు మైదానం వీడారు. అయితే మైదానం వీడే క్రమంలో ఆకాశం వైపు చూస్తూ.. శ్రేయస్ అయ్యర్ గట్టిగా అరిచాడు. 'ఓరి దేవుడా.. మా మ్యాచ్‌కే వర్షం అంతరాయం ఎందుకు?'అని అరిచినట్లు కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

IPL 2026 Frustrated Shreyas Iyer Caught on Camera as Rain Halts PBKS Momentum Against KKR at Eden Gardens

గతేడాది కూడా కోల్‌కతా వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. యాదృశ్చికమో ఏమో కానీ మళ్లీ ఇరు జట్ల మధ్య అదే ఈడెన్ గార్డెన్స్ వేదికగా వర్షం అడ్డంకిగా మారింది. దాంతోనే శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు పంజాబ్ కింగ్స్ జేవియర్ బార్ట్‌లెట్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. రెండో ఓవర్‌లోనే ఫిన్ ‌అలెన్, కామెరూన్ గ్రీన్‌లను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. శుభారంభం చేసిన మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారడంతోనే అయ్యర్ అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేకేఆర్ ఈ సీజన్‌లో బలహీనంగా ఉంది. ఈజీగా గెలిచిన మ్యాచ్‌ వర్షంతో రద్దవ్వతుందా? అనే ఆందోళనతోనే అయ్యర్ గట్టిగా అరిచాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం వర్షం పడుతూనే ఉంది. వర్షం ఆగితేనే మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడే పరిస్థితి ఉంటేనే మ్యాచ్ నిర్వహిస్తారు. లేదంటే రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. గత రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించగా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Story first published: Monday, April 6, 2026, 21:33 [IST]
Other articles published on Apr 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+