For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: SRH కొన్న ఆ నలుగురికి తుది జట్టులో చోటు గ్యారెంటీ!

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. జాక్ ఎడ్వర్డ్స్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేసింది.

సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), శివమ్ మావి(రూ.75 లక్షలు) అనే దేశవాళీ ఆటగాళ్లను తీసుకుంది. అయితే ఈ 10 మందిలో నలుగురికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరో ఒక లుక్కెద్దాం.

IPL 2026 Four New Sunrisers Hyderabad Signings Likely to Get Playing XI Opportunities

1. లియామ్ లివింగ్ స్టోన్..

ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ అయిన లియామ్ లివింగ్ స్టోన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కనుంది. నెంబర్ 7 బ్యాటర్‌గా.. లోయరార్డర్ ఫినిషర్‌గా లివింగ్ స్టోన్ ఆరెంజ్ ఆర్మీకి అద్భుతంగా ఉపయోగపడుతాడు. అతని బ్యాటింగ్‌లో జట్టుకు కావాల్సిన పవర్ ఉంది. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. అంతేకాకుండా లివింగ్ స్టోన్ బౌలింగ్‌లోనూ రాణించగలడు. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ వేయగలడు. అన్నింటికి మించి ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు.

2. సలీల్ అరోరా

పంజాబ్ వికెట్ కీపర్ కమ్ సలీల్ అరోరా దేశవాళీ క్రికెట్‌లో టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ పంజాబ్ బ్యాటర్ దుమ్మురేపాడు. 9 మ్యాచ్‌ల్లో 199 స్ట్రైక్‌రేట్, 71 యావరేజ్‌తో 359 పరుగులు చేసింది. ఇందులో బౌండరీల కంటే సిక్స్‌లే ఎక్కువ. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జార్ఖండ్‌పై సలీల్ అరోరా 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సలీల్ అరోనా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్‌లో సెట్ అవుతాడు.


3. శివాంగ్ కుమార్

మధ్యప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ చైనా బౌలర్ శివాంగ్ కుమార్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కనుంది. అత్యంత అరుదైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అతను. నూర్ అహ్మద్ తరహాలో ఫ్లాట్‌ వేస్తాడు. బాల్ పడి బయటకు వెళ్తుంది. గూగ్లీలు ఎక్కువగా వేస్తాడు. కుడిచేతివాటం బ్యాటర్లను ఇబ్బంది పెడుతాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడు. లెఫ్మార్మ్ బ్యాటర్ అయిన శివాంగ్ కుమార్.. లోయరార్డ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగలడు. అతను గన్ ఫీల్డర్ .

4. ప్రఫుల్ హింగే

విదర్భ పేసర్ అయిన ప్రఫుల్ హింగే గంటకు 140 ప్లస్ కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగలడు. మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేయగలడు. కొత్త బంతితో పవర్ ప్లేలో రాణించగలడు. రంజీ ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 26 వికెట్లు తీసాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టుకు సరిగ్గా సరిపోతాడు.

Story first published: Friday, December 19, 2025, 14:53 [IST]
Other articles published on Dec 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+