Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన.. ఆ నలుగురిపై వేటు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. భారీ అంచనాలతో ఈ సీజన్ బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరుకుండానే ఇంటిబాట పట్టింది. జట్టు నిండా వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నా.. ఆన్ పేపర్‌పై భీకరంగా కనిపిస్తున్నా.. మైదానంలో మాత్రం ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపర్చింది. కనీసం పోరాట పటిమను కూడా కనబర్చలేకపోయింది.

ఈ టోర్నీకి ముందు ముంబై ఇండియన్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుతుందని 16 మంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ అంచనా వేసాయి. ముంబై ఇండియన్స్ కూడా అందుకు తగ్గట్లుగానే కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

13 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టోర్నీలో శుభారంభం చేసింది. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ముంబై ఇండియన్స్ ఆటతీరుపై ఆ జట్టు ఓనర్స్ నీతా అంబానీ, ఆకాష్ అంబానీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జట్టులో భారీ ప్రక్షాళన చేయనున్నారు. ముఖ్యంగా నలుగురి ఆటగాళ్లపై వేటు వేసే అవకాశం ఉంది.

IPL 2026 Four High-Value Players Mumbai Indians Might Release Ahead of the IPL 2027 Auction

1. హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ జట్టు ప్రక్షాళనలో భాగంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపైనే తొలి వేటు పడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి రూ.16.35 కోట్ల భారీ ధరతో హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకొని ముంబై మూల్యం చెల్లించుకుంది. హార్దిక్ సారథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా ఎలిమినేటర్‌లో ఓడి ఇంటి బాట పట్టింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండానే వెనుదిరిగింది.

కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హార్దిక్ 20.86 సగటుతో 146 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 11.90 ఎకానమీతో 4 వికెట్లే తీసాడు. అతని వైఫల్యం ముంబై పతనాన్ని శాసించింది. వెన్ను నొప్పితో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అన్‌ఫాలో చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముంబైతో హార్దిక్‌కు చెడిందని, ఆ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పాడని ప్రచారం జరుగుతోంది.

2. సూర్యకుమార్ యాదవ్

రూ.16.35 కోట్ల భారీ ప్రైజ్ ట్యాగ్‌తో జట్టులో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై కూడా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వేటు వేయనుంది. గతేడాదిగా అతను పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ 11 మ్యాచ్‌ల్లో 17.33 సగటుతో 195 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. మిడిలార్డర్‌లో అతని వైఫల్యం ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసి జట్టు పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే సూర్యకు ముంబై ఇండియన్స్ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాదికి ముందు మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది. అదే జరిగితే జట్టు మొత్తాన్ని ముంబై ఇండియన్స్ మార్చనుంది.

3. ట్రెంట్ బౌల్ట్..

న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్‌ను నట్టేట ముంచాడు. రూ.12.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేయగా.. అతను మాత్రం 5 మ్యాచ్‌ల్లో 11.63 సగటుతో 2 వికెట్లు మాత్రమే తీసాడు. ట్రెంట్ బౌల్ట్ వైఫల్యం.. జస్‌ప్రీత్ బుమ్రాపై కూడా ప్రభావం చూపింది. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఏబీ డివిలియర్స్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ఒకప్పటిలా లేదని హెచ్చరించాడు. అతను అన్నట్లుగానే ట్రెంట్ బౌల్ట్ చెత్త ప్రదర్శనతో ముంబై కొంపముంచాడు. ఈ క్రమంలోనే ట్రెంట్ బౌల్ట్‌కు ముంబై గుడ్‌బై చెప్పనుంది.

4. రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్‌కు ఐకాన్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మకు కూడా ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. రూ.16.30 కోట్ల భారీ ధరతో జట్టులో కొనసాగుతున్న రోహిత్ శర్మ.. తొడ కండరాల గాయంతో ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీ ముంబై పతనాన్ని శాసించింది. 6 మ్యాచ్‌ల్లో 48 సగటు, 2 హాఫ్ సెంచరీలతో 243 పరుగులు చేశాడు. కానీ గతంలోలా ప్రభావం చూపలేకపోతున్నాడు. 2027 నాటికి రోహిత్ వయసు కూడా పెరగనుంది. అతనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Tuesday, May 12, 2026, 14:57 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+