Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 వేలంలో భారీ ధర పలికే అనామక భారత ఆటగాళ్లు ఎవరంటే!

ఐపీఎల్ 2026 మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఈ మినీ వేలానికి మొత్తం 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బీసీసీఐ ఈ జాబితాను 350 మందికే పరిమితం చేసింది. ఇందులో 224 మంది భారత అనామక ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న భారత దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపై 10 ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా ఐదుగురు అనామక ఆటగాళ్లు మినీ వేలంలో భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. ఆ ఐదుగురి ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

1.అకిబ్ నబీ ధర్

జమ్మూ కశ్మీర్‌కు చెందిన అకిబ్ నబీ ధర్ మినీ వేలంలో భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. ఈ 29 ఏళ్ల పేసర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే ఛాన్స్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7.41 ఎకానమీతో 15 వికెట్లు తీసాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడం అతని ప్రత్యేకత. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు పడగొట్టాడు.

IPL 2026 Five Uncapped Indian Stars Poised to Hit the Jackpot at the Auction

2. కార్తీక్ శర్మ

రాజస్థాన్ రాయల్స్‌కు కార్తీక్ శర్మ కూడా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. ఈ 19 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సయ్యద్ ముస్తా అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 160+ స్ట్రైక్‌రేట్‌తో 133 పరుగులు చేశాడు. అతని వికెట్ కీపింగ్ సామర్థ్యంతో పాటు ఫినిషర్‌గా భారీ షాట్స్ ఆడే సత్తా ఉండటం ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తోంది.

3. తుషార్ రహేజా

తమిళనాడుకు చెందిన తుషార్ రహేజా కూడా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు ఓపెనర్‌గా బరిలోకి దిగిన తుషార్ రహేజా 7 మ్యాచ్‌ల్లో 164 స్ట్రైక్‌రేట్‌తో 151 పరుగులు చేశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తుషార్ రహేజా 185 స్ట్రైక్‌రేట్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపింగ్ అతని అదనపు సామర్థ్యం.

4. అన్‌మోల్ ప్రీత్ సింగ్

పంజాబ్‌కు చెందిన అన్‌మోల్ ప్రీత్ సింగ్‌కు దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన రికార్డ్ ఉంది. అతను పంజాబ్ తరఫున నిలకడగా ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 172 స్ట్రైక్‌రేట్ 241 పరుగులు చేశాడు.

5. అశోక్ శర్మ

రాజస్థాన్‌కు చెందిన అశోక్ శర్మ కూడా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. ఈ 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్నాడు.

Story first published: Wednesday, December 10, 2025, 18:23 [IST]
Other articles published on Dec 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+