Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఫిన్ అలెన్ ఊచకోత.. ఢిల్లీపై కేకేఆర్ ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో కేకేఆర్ అసాధారణ ప్రదర్శనతో జైత్రయాత్ర‌ను కొనసాగిస్తోంది. ఢిల్లీ వేదికగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.

ముందుగా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఢిల్లీని కట్టడి చేయగా.. అనంతరం ఫిన్ అలెన్ అజేయ శతకంతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితిని తెచ్చుకుంది.

IPL 2026 Finn Allen Explosive Unbeaten Century Powers KKR to Victory DC Knocked Out of Playoff Race

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అషుతోష్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసి 34 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఫిన్ అలెన్(47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(27 బంతుల్లో 2 సిక్స్‌లతో 33 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. ఫిన్ అలెన్ విన్నింగ్ షాట్‌గా సిక్సర్‌‌‌ బాదడంతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు. 10 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసాడు. ఈ మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. ముఖ్యంగా మిడిలార్డ్ వైఫల్యం కోలుకోలేని దెబ్బతీసింది.

Story first published: Friday, May 8, 2026, 22:47 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+