Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: 10 సిక్సర్లతో విధ్వంసం..!

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్యాటర్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిన్ అలెన్ 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగలు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

అతనికి తోడుగా అంగ్‌క్రిష్ రఘు వంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82 నాటౌట్), కామెరూన్ గ్రీన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 2 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కు ఇది రికార్డ్ స్కోర్.

గుజరాత్ బలాన్ని దెబ్బతీసాడు..

గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలం బౌలింగ్. కానీ ఆ బలాన్నే ఫిన్ అలెన్ బలహీనంగా మార్చాడు. ఆరంభంలో కాస్త టైమ్ తీసుకున్న ఫిన్ అలెన్.. కగిసో రబాడ వేసిన నాలుగో ఓవర్‌ నుంచి తన ఊచకోత మొదలు పెట్టాడు.

IPL 2026 Finn Allen Brutal 93 With 10 Sixes Powers KKR to Massive 247 2 Against Gujarat Titans

ఆ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ఫిన్ అలెన్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్ బాది 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హోల్డర్ బౌలింగ్‌లో రెండు, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు, ఫోర్ బాదాడు. అదే జోరులో సాయి కిషోర్ బౌలింగ్ ఔటై శతకాన్ని చేజార్చుకున్నాడు.

అరుదైన రికార్డ్..

ఈ ఇన్నింగ్స్‌తో ఫిన్ అలెన్ అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో రెండు సార్లు 10+ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. మే8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఫిన్ అలెన్.. ఆ మ్యాచ్‌లో 10 సిక్స్‌లు బాదాడు.

ఐపీఎల్‌లో కేకేఆర్ నమోదు చేసిన అత్యధిక స్కోర్లు:

272/7 - ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పై, వైజాగ్, 2024

261/6 - పంజాబ్ కింగ్స్ (PBKS) పై, కోల్‌కతా, 2024

247/2 - గుజరాత్ టైటాన్స్ (GT) పై, కోల్‌కతా, 2026*

245/6 - పంజాబ్ కింగ్స్ (PBKS) పై, ఇండోర్, 2018

235/6 - లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై, లక్నో, 2024

ఐపీఎల్ యొక్క ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు:

24 - పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), కోల్‌కతా, 2024

22 - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), బెంగళూరు, 2024

22 - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ఢిల్లీ, 2024

22 - కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT), కోల్‌కతా, 2026*

21 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పుణే వారియర్స్ ఇండియా (PWI), బెంగళూరు, 2013

21 - పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముల్లన్‌పూర్, 2026.

Story first published: Saturday, May 16, 2026, 21:56 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+