IPL 2026: థర్డ్ అంపైర్‌పై కన్నెర్ర చేసిన కోహ్లీ, అనుష్క శర్మ!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆర్‌సీబీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ అందుకున్న ఓ డైవ్ క్యాచ్ తీవ్ర చర్చనీయాంశమైంది.
వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన ఈ క్యాచ్‌ను జోర్డాన్ కాక్స్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు కనిపించడంతో అంపైర్లు.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి నేలకు తాకిందని చెబుతూ నాటౌట్ ఇచ్చాడు.

అయితే బంతి నేలకు తాకినా.. బంతి కింద ఫీల్డర్ చేతులున్నాయని ఆర్‌సీబీ వాదించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ అంపైర్‌తో వాగ్వాదానికి కూడా దిగాడు. స్టేడియంలోని భారీ స్క్రీన్‌పై నాటౌట్ అని థర్డ్ అంపైర్ తీర్పు కనిపించగానే.. కోహ్లీ షాక్‌కు గురయ్యాడు. ఇదెక్కడి దిక్కుమాలి నిర్ణయమని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ సైతం అవాక్కైంది. ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
జాకోబ్ డఫీ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని వాషింగ్టన్ సుందర్ పుల్ షాట్ ఆడగా.. ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. జోర్డాన్ కాక్స్ అద్భుతంగా అందుకున్నప్పటికీ బంతి నేలకు తాకినట్లు అనిపించిండంతో థర్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. వాషింగ్టన్ సుందర్(37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యరు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్(3/27) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీసారు. కృనాల్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications