Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 Final: అహ్మదాబాద్‌లో అతనికి అదిరిపోయే రికార్డ్.. దబిడి దిబిడే!

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)అభిమానులను ఓ అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఫైనల్ జరిగే అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అదిరిపోయే రికార్డ్ ఉంది. ఈ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ గిల్ పరుగుల మోత మోగించాడు.

ఫైనల్లో ఆర్‌సీబీ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. శుభ్‌మన్ గిల్ రూపంలో వారికి పెద్ద సవాల్ ఎదురు కానుంది. అహ్మదాబాద్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డ్స్ చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతోంది.

IPL 2026 Final Shubman Gill s Stunning Record at Narendra Modi Stadium Poses a Massive Threat to RCB

నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ 1,500 పరుగులకు పైగా సాధించి సత్తా చాటాడు. టీ20, వన్డే, ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లలోనూ ఈ మైదానంలో అతని బ్యాటింగ్ తిరుగులేనిది. ముఖ్యంగా, అతను 165.56 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో గిల్‌కు బౌండరీలపై మంచి స్పష్టత ఉంది. శుభ్‌మన్ గిల్ ఈ అద్భుతమైన ఫామ్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు, భారత జట్టుకు అహ్మదాబాద్‌ మైదానంలో పెద్ద బలంగా నిలుస్తుంది. గుజరాత్ జట్టుకు గిల్, సాయి సుదర్శన్, బట్లర్ కీలక బ్యాటర్లు. ఆర్‌సీబీ తమ రెండో కప్ సాధించాలంటే.. వీరిని వీలైనంత త్వరగా ఔట్ చేయాలి.

Story first published: Sunday, May 31, 2026, 17:08 [IST]
Other articles published on May 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+