Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 Final: 180 కొడితే గెలిచేవాళ్లం: శుభ్‌మన్ గిల్

బ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్ పవర్ ప్లేలో అదనంగా పరుగులివ్వడం తమ ఓటమిని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. బ్యాటింగ్‌లో 180-190 పరుగులు చేసినా.. బౌలింగ్ పవర్ ప్లేలో 15-20 పరుగులు తక్కువగా ఇచ్చినా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆర్‌సీబీ రెండో టైటిల్ ముద్దాడగా.. గుజరాత్ టైటాన్స్‌కు రెండోసారి టైటిల్ చేజారింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను ప్రభావితం చేసిందన్నాడు.

180 పరుగులు చేసి ఉంటే..

'మేం గనుక 180-190 పరుగులు చేసి ఉంటే.. ఈ మ్యాచ్‌ ఉత్కంఠగా మారేది. ఈ పిచ్ మరీ స్లోగా ఏం లేదు. సాధారణంగా ఈ వికెట్‌పై తొలి మూడు, నాలుగు ఓవర్లు బౌలర్లకు కొంచెం మూవ్‌మెంట్ లభిస్తోంది. దాంతో మేం ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయాం. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మూమొంటమ్ కోల్పోయాం. దాంతో స్కోరు బోర్డును ముందుకు ఉరకలెత్తించలేకపోయాం. ఫైనల్లో 150-160 పరుగులు చేసినా.. పవర్ ప్లేలో ఒకటి రెండు వికెట్లు తీస్తే మ్యాచ్ పట్టు సాధించవచ్చనుకున్నాం.

IPL 2026 Final Shubman Gill Blames Early Batting Collapse and Costly Powerplay Bowling for GT s Defeat Against RCB
Photo Credit: X (twitter)

కానీ ఆర్‌సీబీ విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో 15-20 పరుగులు అదనంగా చేసి మ్యాచ్ లాగేసుకుంది. ఒకవేళ మేం వారిని పవర్‌ప్లేలో 50-55 పరుగుల లోపే కట్టడి చేసి ఉంటే.. మాకు మంచి అవకాశం ఉండేది. కానీ వారు పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను తమ వైపు తిప్పేసుకున్నారు.

ఓడినా గర్వంగా ఉంది..

ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ జట్లలో మేం ఒకటిగా నిలిచామని నేను భావిస్తున్నా. మేం మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత.. టోర్నమెంట్‌లోకి తిరిగి పుంజుకున్న విధానం అద్భుతం. మేము నిరంతరం మా తప్పిదాలను విశ్లేషించుకుంటూ ముందుకు సాగాం. ఫైనల్లో ఓడినా ఈ టోర్నీలో మేం కనబర్చిన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ విజయ గర్జన..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. వాషింగ్టన్ సుందర్(37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యరు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్(3/27) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీసారు. కృనాల్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.

అనంతరం ఆర్‌సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) పర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Monday, June 1, 2026, 8:10 [IST]
Other articles published on Jun 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+