IPL 2026 ప్రైజ్‌మనీ ఎంతంటే..?
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఒక్కసారైనా ఈ లీగ్ ఆడాలని కలలు కంటారు. ఈ టోర్నీ క్యాష్ ప్రైజ్ కూడా ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్స్ కంటే ఎక్కువే.
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. అయితే ఈ సీజన్‌లో ప్రైజ్‌మనీ వివరాల గురించి తెలుసుకుందాం.
బీసీసీఐ వర్గాల ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ప్రైజ్‌మనీ రూ.46.50 కోట్లు. ఫైనల్లో విజేత అయిన జట్టుకు టైటిల్‌తో పాటు అత్యధికంగా రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. రన్నరప్ టీమ్‌కు రూ.13 కోట్లు, ప్లే ఆఫ్స్‌కు చేరిన మరో రెండు జట్లలో క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.6.50 కోట్లు వస్తాయి.

మిగతా జట్లకూ ప్రైజ్‌మనీ అస్సలు రాదు. అంటే పాయింట్ల టేబుల్‌లో ఐదో స్థానం నుంచి పదో స్థానం వరకూ ఉన్న జట్లకు ఏమీ దక్కదు. ఆటగాళ్లకూ వ్యక్తిగతంగా ప్రైజ్‌మనీ ఇస్తారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్స్, అత్యధిక విలువైన ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున ఇస్తారు. ఎమర్జింగ్ ప్లేయర్‌కు రూ.20 లక్షలు అందుతాయి.
ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.4.8 కోట్లు దక్కేవి. తర్వాత సీజన్‌లోనూ అంతే మొత్తం. అయితే 2010 నుంచి 2013 వరకు రూ.10 కోట్ల చొప్పున అందించారు. 2014, 2015లో రూ.15 కోట్లు, 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు విజేతకు దక్కింది. కరోనా కారణంగా 2020లో ప్రైజ్‌మనీని రూ.10 కోట్లకు తగ్గించింది. ఇక 2021 నుంచి ప్రస్తుత సీజన్ వరకూ రూ.20 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీని విజేతకు ఇస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications