IPL 2026: అందుకే తుది జట్టును మార్చలేదు: రజత్ పాటిదార్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది చాలా మంచి వికెట్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. వీలైనంత త్వరగా గుజరాత్‌ను ఔట్ చేయడానికి ప్రయత్నిస్తాం. గతేడాదికి సంబంధించిన చాలా జ్ఙాపకాలు ఇక్కడ ఉన్నాయి. కానీ అది 2025లో జరిగింది. ఇప్పుడు ఇది 2026. ఈ మ్యాచ్ గెలవడానికి మేం మా సాయశక్తులా ప్రయత్నించాలి.

ఎక్కువగా ఆలోచించకుండా.. ప్రస్తుతంపై మాత్రమే ఫోకస్ పెట్టాలి. మన చేతుల్లో ఉన్న విషయాలను మనమే నియంత్రించుకోవాలి. ఈ స్టేడియంలో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. ముఖ్యంగా ఆర్‌సీబీ అభిమానుల మద్దతు అమోఘం. మా 12వ మ్యాన్ ఆర్మీ. వారు ప్రతీ స్టేడియానికి వచ్చి మాకు ఎంతో మద్దతుగా నిలిచారు. తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'ఇది ఒక సాధారణ వికెట్. ఇక్కడ మేం ఆడుతున్న మూడో మ్యాచ్ ఇది. తొలి మూడు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుంచి కొంత మూవ్‌మెంట్ లభించే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాల్లో ఒకటి. మా జట్టులో ఒక మార్పు ఉంది. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబడా, అర్షద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్.
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications