DC vs GT: మిల్లర్ కాదు.. ఆ శనిగాడి వల్లే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓటమి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సునాయసంగా గెలవాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా ఓటమిపాలైంది.
డేవిడ్ మిల్లర్ పోరాడినా ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయం దక్కలేదు. ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్‌లో విప్రజ్ నిగమ్ తొలి బంతికే బౌండరీ బాది.. రెండో బంతికి క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ సింగిల్ తీసివ్వగా.. మిల్లర్ నాలుగో బంతిని సిక్సర్ బాది మ్యాచ్‌ను పూర్తిగా ఢిల్లీ చేతుల్లోకి తీసుకొచ్చాడు.
ఆ సింగిల్ తీసి ఉంటే..
చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతిని డీప్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన మిల్లర్.. సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా తీయలేదు. క్రీజు వరకు వచ్చిన కుల్దీప్ వెనక్కి వెళ్లిపోయాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. మిల్లర్ బంతిని వదిలేసి పరుగు తీసాడు. వికెట్ కీపర్ బట్లర్ ఏ తప్పిదం చేయకుండా కుల్దీప్ యాదవ్‌ను రనౌట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ విజయం లాంఛనమైంది.

అయితే ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ కనీసం డ్రా అయ్యేది అని, ఆఖరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడని ఢిల్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ మిల్లర్ వల్లే ఢిల్లీ ఓడిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ గాయంతో మిల్లర్ ఆఖరి వరకు జట్టు కోసం పోరాడాడనే విషయాన్ని గ్రహించడం లేదు. గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మిల్లర్..జట్టు కోసం మళ్లీ బరిలోకి దిగి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సింగిల్ తీయకపోవడం తప్పే అయినా.. భారీ షాట్‌తో మ్యాచ్ ముగించాలనే అతని ప్రణాళిక ఫలించలేదు.
కొంపముంచింది రాహులే..
అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ అని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసాధారణ ప్రదర్శన కనబర్చిన కేఎల్ రాహుల్(52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92) కీలక సమయంలో ఔటై సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
అంతేకాకుండా డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్(7) రనౌట్‌కు కారణమయ్యాడు. క్విక్ సింగిల్‌కు మూమెంటమ్ ఇచ్చి 'నో’ అని చెప్పాడు. కానీ బంతిని అందుకున్న సాయి సుదర్శన్ ఏ తప్పిదం చేయకుండా డైరెక్ట్ హిట్‌తో స్టబ్స్‌ను రనౌట్ చేశాడు. ఈ రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. స్టబ్స్ క్రీజులో ఉండి ఉంటే మిల్లర్ అవసరం లేకుండా ఢిల్లీ విజయం సాధించేది. స్టబ్స్ ఔటైనా.. క్రీజులో సెట్ అయినా రాహుల్ ఆఖరి వరకు క్రీజులో ఉండాల్సింది.
శనిగాడి వల్లే ఓటమి..
ఛేజింగ్‌లో సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఉంటేనే విజయం దక్కుతుందనేది బేసిక్ సూత్రం. కానీ రాహుల్ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకొని ఢిల్లీ ఓటమికి కారణమయ్యాడు. కేఎల్ రాహుల్.. మ్యాచ్ గెలిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎంత అద్భుతంగా ఆడినా ఆఖర్లో ఔటై జట్టు ఓటమికి కారణమయ్యేవాడు.
గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడినప్పుడు చాలా సార్లు ఇలానే ఔటయ్యాడు. తాజా మ్యాచ్‌లోనూ అలానే ఔటవ్వడంతో శనిగాడైన రాహుల్ వల్లే ఢిల్లీ ఓడిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను విఫలమైనా ఢిల్లీ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. జట్టుకు రాహుల్ శనిలా దాపురించాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications