IPL 2026: ఈడు పిల్లోడా? పిడుగా? పాపం SRH
ఐపీఎల్ 2026 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏదైతే జరగకూడదని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్యాన్స్ కోరుకున్నారో అదే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) సిక్సర పిడుగులా విరుచుకుపడ్డాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.
వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(3/54) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. వైభవ్ విధ్వంసంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 80 పరుగులు చేసింది. వైభవ్ జోరుకు బ్రేక్ వేసేందుకు ప్యాట్ కమిన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. పవర్ ప్లే అనంతరం మరింత దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ 13 బంతుల్లోనే 97 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకునేలా కనిపించిన వైభవ్ సూర్యవంశీని ప్రఫుల్ హింగే ఔట్ చేయడంతో వరల్డ్ రికార్డ్ చేజారింది.
ఆ కాసేపటికే యశస్వి జైస్వాల్(29) ఔట్ కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్‌తో కలిసి ధ్రువ్ జురెల్ చెలరేగాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ధ్రువ్ జురెల్‌ను ప్రఫుల్ హింగే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 260+ స్కోర్ చేస్తుందనుకున్న రాజస్థాన్ రాయల్స్ 243 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications