అందుకే ప్రఫుల్ హింగేను తీసుకున్నాం: ప్యాట్ కమిన్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన ప్యాట్ కమిన్స్.. ప్రఫుల్ హింగే తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు. టీమ్ వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
ఒక మార్పు చేశాం..
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఫైనల్స్ ఆడిన అనుభవం ఈ మ్యాచ్‌లో ఉపయోగపడుతుందా? అంటే అవునని చెప్పలేను. కానీ ఆ అనుభవంతో కాస్త రిలాక్స్ అవ్వచ్చు. కానీ అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే. మేం మా జోరును కొనసాగించాలనుకుంటున్నాం. మేం మా వ్యూహాలను అమలు చేసే ప్రయత్నం చేస్తాం. మా సహజమైన బలాలపైనే ఆధారపడుతాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. ప్రఫుల్ హింగే తుది జట్టులోకి వచ్చాడు.

టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని ముందుగా ఏం అనుకోలేదు. ఇక్కడ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం. టాస్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. టాస్ ఓడినా మాకు జరిగే నష్టం ఏం ఉండేది కాదు. మేం బంతితో ఈ మ్యాచ్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
అలా అయితే ఓడినా సంతోషమే..
మరోవైపు టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలనే విషయంలో తాము కూడా గందరగోళంగా ఉన్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. కానీ ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. 'ఈ మైదానంలో ఛేజింగ్ రికార్డ్ బాగుంది. ఆ రికార్డ్‌ను మార్చేందుకు ఇది మంచి సమయమని భావిస్తున్నా. ఈ మైదానంలో మాకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచాం. ఇక్కడ లక్ష్యాలను ఛేదించడంతో పాటు డిఫెండ్ కూడా చేసుకున్నాం. ఈ సెంటిమెంట్‌ను అలానే కొనసాగించాలనుకుంటున్నాం.
ఈ మ్యాచ్ ఆడటానికి నేను ఫిట్‌గా ఉన్నాను. తప్పక గెలవాల్సిన పరిస్థితి కాబట్టి కసిని పెంచవచ్చు. మ్యాచ్ గెలవడం మినహా మాకు మరో ఆప్షన్ లేదు. గెలుపు కోసం మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. మా 100 శాతం పోరాడిన తర్వాత గెలిచినా.. ఓడినా సంతోషంగా ఉంటాను. విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు(అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications