Tim David: అంపైర్లతో ఆట.. తీరిన తీట!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ టీమ్ డేవిడ్‌తో పాటు ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఐపీఎల్ నియామవళిని ఉల్లంఘించారు.
అంపైర్ల మాటలను బేఖాతరు చేస్తూ.. బంతినివ్వకుండా వారితో ఆటాడిన టీమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తూ మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. స్లో ఓవర్ రేట్‌కు కారణమైన హార్దిక్ పాండ్యాకు హెచ్చరికతో పాటు రూ. 12 లక్షల జరిమానా విధించారు.
అంపైర్లకు బంతి ఇవ్వకుండా..
అంపైర్ల ఫిర్యాదుతో మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నాడు. ఇద్దరూ ఆటగాళ్లు తమ తప్పిదాలను అంగీకరించడంతో పాటు శిక్షకు అంగీకరించారు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా డ్యూ కారణంతో అంపైర్లు బంతిని మార్చారు. అయితే ఆ బంతి ఆకారం కోడిగుడ్డు ఆకారంలో ఉందంటూ గాల్లోకి ఎగిరివేస్తూ టీమ్ డేవిడ్ ఆట ఆడాడు.
అంపైర్లు ఎంత చెప్పినా బంతి ఇవ్వకుండా అలానే చేశాడు. చివరకు అంపైర్ గట్టింగా మందలించడంతో బంతి ఇచ్చాడు. అంపైర్ల మాటను వినకపోవడం ఐపీఎల్ రూల్ 2.4 కింద లెవెల్ 1 ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ రూల్ ప్రకారం అతనిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు.

హార్దిక్‌కు ఫస్ట్ ఫైన్..
మరోవైపు హార్దిక్ పాండ్యా నిర్ణీత సమయం కన్నా ఒక ఓవర్ తక్కువగా వేసాడు. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ విషయంలో ముంబై ఇండియన్స్ చేసిన మొదటి తప్పు ఇది. మరో రెండు సార్లు ఇలానే స్లో ఓవర్‌రేట్‌కు కారణమైతే హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది.
ఆర్‌సీబీ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50), రజత్ పాటిదార్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్(31 బంతుల్లో ఫోర్, 9 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 40),ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ(2/47) రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, జాకోబ్ డఫీ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications