Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆదుకున్న ఆర్చర్.. ముంబై ముందు రాజస్థాన్ పోరాడే లక్ష్యం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 206 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ.. జోఫ్రా ఆర్చర్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 32) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.

దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27), డసన్ షనక(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 29), రవీంద్ర జడేజా(11 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) పర్వాలేదనిపించారు.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, అల్లా ఘజన్‌ఫర్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు.

IPL 2026 Dhruv Jurel and Jofra Archer Power Rajasthan Royals to a Massive 205 8 Against Mumbai Indians

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(4) తీవ్రంగా నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్(27) భారీ స్కోర్ చేయలేకపోయాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది.

ధ్రువ్ జురెల్(38), డసన్ షనక(29) 44 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. డసన్ షనక రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్(38),ఫెరిరా(18) కూడా ఔటవ్వడంతో రాజస్థాన్ మూమెంటమ్ కోల్పోయింది. కానీ జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

Story first published: Sunday, May 24, 2026, 18:16 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+