IPL 2026 షెడ్యూల్‌లో మార్పు.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్లు మార్చి 26న కాకుండా.. రెండు రోజుల ఆలస్యంగా మార్చి 28న ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరలేవబోతుంది. అంటే మే 31న ఫైనల్ జరుగుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ మార్చి 8న ముగియనుండటంతో.. కొత్త సీజన్‌కు ముందు ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు కాస్త సమయం ఇచ్చేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ నిర్ణయంపై ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే వారంలో బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్ ఫో పేర్కొంది. పూర్తి స్థాయి షెడ్యూల్‌తో పాటు వేదికలను కూడా ఆ రోజే వెల్లడించే అవకాశం ఉంది.

ఆలస్యం ఎందుకంటే..?
సాధారణంగా ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను బీసీసీఐ ఒక నెల రోజుల ముందే ప్రకటిస్తోంది. కానీ ఈ సారి అసోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఖరారు చేయలేదు. దాంతో బీసీసీఐ కూడా వేచి చూస్తోంది. ఆయా వేదికల్లో కోల్‌కతా, సీఎస్‌కే టీమ్స్ ఉండగా.. రాజస్థాన్ రాయల్స్‌కు గౌహతి రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉంది.
ఎన్నికలు, మ్యాచ్‌ల తేదీలు క్లాష్ కాకుండా ఉండేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. షెడ్యూల్ క్లాష్ అయితే సెక్యూరిటీకి ఇబ్బంది కానుంది. ఈ క్రమంలోనే ఎన్నికల తేదీలను బట్టి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అవసరమైతే రెండు దశల్లో షెడ్యూల్‌ను రిలీజ్ చేయవచ్చు. ఎన్నికల తేదీలు క్లాష్ అయితే సీఎస్‌కే, కేకేఆర్ హోమ్ మ్యాచ్‌లు ఇతర వేదికలకు తరించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications