అందుకే నటరాజన్‌ను పక్కన పెట్టాం: అక్షర్ పటేల్
పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే తమ పేసర్ టీ నటరాజన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. రెండు మార్పులతో ఈ మ్యాచ్ ఆడుతున్నామని టాస్ సందర్భంగా అక్షర్ పటేల్ తెలిపాడు.
ఢిల్లీ వికెట్ స్లోగా ఉంటుందని స్పిన్నర్లు, పేసర్లకు సమంగా సహకరిస్తుందని చెప్పాడు. దాంతోనే ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని, ఈ క్రమంలోనే నటరాజన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని అక్షర్ పటేల్ వెల్లడించాడు.
అది మన చేతుల్లో లేని పని..
'ముందుగా బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేయడం అనేది మన చేతుల్లో లేని పని. కాబట్టి జట్టుగా ముందుగా బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా అందుకు సిద్దంగా ఉండాలి. తొలి బంతి నుంచే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. మేం రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. నటరాజన్ స్థానంలో ముఖేష్ కుమార్ బరిలోకి దిగుతున్నాడు. విప్రజ్ నిగమ్ కూడా జట్టులోకి వచ్చాడు.

నా అనుభవం ప్రకారం ఢిల్లీ వికెట్‌పై బంతి అంతగా టర్న్ అవ్వదు. కానీ పిచ్ స్లోగా ఉంటుంది. బంతి చాలా నెమ్మదిగా బ్యాట్‌పైకి వస్తుంది. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. పేసర్లకు స్లోయర్, బౌన్సర్లు వేస్తే అడ్వాంటేజ్ లభిస్తుంది. అందుకే మేం ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.
బౌండరీల పరిమాణంతో పని లేదు..
ఇక్కడ ఆడేవారంతా ప్రొఫెషనల్ క్రికెటర్లు. అందరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారే. కాబట్టి మా వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేవు. సరైన చోట బంతి వేస్తే అది ఎప్పుడూ మంచి బంతే అవుతుంది. బ్యాడ్ బాల్ వేస్తే బౌండరీలు ఎంత దూరం ఉన్నా బ్యాటర్లు సిక్సర్లు కొట్టేస్తారు. కాబట్టి బౌండరీ పరిమాణంపై కాకుండా.. బౌలింగ్‌పై ఫోకస్ పెట్టడం ముఖ్యం. మంచి బంతులతో వికెట్లు తీయడం చాలా కీలకం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఢిల్లీ పిచ్‌ను అంచనా వేయడం కష్టమని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నామని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. గత 3-4 మ్యాచ్‌ల్లో ఈ పిచ్ విభిన్నంగా స్పందించిందని గుర్తు చేశాడు. ఓ మ్యాచ్‌లో రికార్డ్ స్కోర్ నమోదైతే మరో మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ వచ్చిందని చెప్పాడు. టాస్ ఓడినా గెలిచినా 40 ఓవర్ల పాటు అత్యుత్తమ క్రికెట్ ఆడటం ముఖ్యమని తెలిపాడు. సుదీర్ఘ విరామం లభించినప్పుడల్లా తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చిందని, ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సంక, కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగీ ఎన్గిడి, ముఖేష్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications