Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేజీని చూసేందుకు డేవిడ్ వార్నర్ ప్రయత్నించగా.. 'User not found', 'This profile is private' అని చూపించింది. సాధారణంగా ఎవరినైనా బ్లాక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

ఐపీఎల్ 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి టైటిల్ ముద్దాడింది. ఆ సీజన్ ఫైనల్లో ఆర్‌సీబీని ఓడించి మరి విజేతగా నిలిచింది. డేవిడ్ వార్నర్(848 పరుగులు) అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2026 Never Getting Unblocked - David Warner Reveals Sunrisers Hyderabad Still Have Him Blocked on Social Media

SRH తరఫున అత్యధిక మ్యాచ్‌లకు (67 మ్యాచ్‌లు) కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్.. 35 విజయాలను అందించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. SRH తరఫున 95 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 4,010 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలతో పాటు 2 సెంచరీలు ఉన్నాయి.

IPL 2026: ఒరెయ్ నువ్వు మనిషివేనా.. పాపం బుడ్డోడు

IPL 2026: ఒరెయ్ నువ్వు మనిషివేనా.. పాపం బుడ్డోడు

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 3 సార్లు 'ఆరెంజ్ క్యాప్' గెలిచిన ఏకైక బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఇందులో విశేషం ఏంటంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునే వార్నర్ ఈ ఘనతను అందుకున్నాడు.

2015 ఐపీఎల్: 562 పరుగులు

2017 ఐపీఎల్: 641 పరుగులు

2019 ఐపీఎల్: 692 పరుగులు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కేవలం ఆట పరంగానే కాకుండా, తన దూకుడుతో, మైదానంలో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ "హైదరాబాదీ నవాబ్"గా తెలుగు అభిమానుల గుండెల్లో డేవిడ్ వార్నర్ చెరగని ముద్ర వేశారు. 2021 సీజన్ తర్వాత మేనేజ్‌మెంట్‌తో వచ్చిన విభేదాలతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ వార్నర్‌ను దూరంగా పెట్టింది. అయితే SRHకు కప్ అందించిన కెప్టెన్‌ను బ్లాక్ చేయడమేంటని నెటిజన్లు ఫైరవుతున్నారు. జట్టు ఓనర్ కావ్యా మారన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లను గౌరవించాలని సూచిస్తున్నారు.

IPL 2026: ఆదుకున్న ఆర్చర్.. ముంబై ముందు రాజస్థాన్ పోరాడే లక్ష్యం!

IPL 2026: ఆదుకున్న ఆర్చర్.. ముంబై ముందు రాజస్థాన్ పోరాడే లక్ష్యం!
Story first published: Sunday, May 24, 2026, 18:52 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+