Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్క తప్పిదమే మా ఓటమికి కారణం: రుతురాజ్ గైక్వాడ్

వికెట్ తీసిన వెంటనే ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయామని, అదే తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా టోర్నీ ఆసాంతం తమ జట్టు కనబర్చిన ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

ఓడినా గర్వపడుతున్నా..

ఈ పరాజయం అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఇదో గొప్ప మ్యాచ్ అని తెలిపాడు. ఆఖరి వరకు విజయం కోసం పోరాడమని చెప్పాడు. 'ఇదో అద్భుతమైన మ్యాచ్. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. 19వ ఓవర్ వరకు మేం మ్యాచ్‌లోనే ఉన్నాం. ఇది టీ20 క్రికెట్‌కు సరిపోయే మంచి పిచ్.

IPL 2026 CSK Skipper Ruturaj Gaikwad Explains Where the Team Failed to Capitalize Against SRH
Photo Credit: screen grab for JioHotstar

మ్యాచ్ జరుగుతున్నంత సేపు పిచ్ ఏమాత్రం మారలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేయడం అనేది ఇక్కడ ఒక మంచి పోరాడే స్కోర్. ఇదొక అద్భుతమైన మ్యాచ్. కొన్ని విషయాల్లో మేం వెనుకబడి మూల్యం చెల్లించుకున్నాం. అయినా మా ఆటగాళ్ల ప్రదర్శనను చూసి గర్వపడుతున్నా.

ఆ తప్పిదమే ఓటమికి కారణం..

ఈ మ్యాచ్‌లో మేం మూడు విభాగాల్లో మెరుగ్గానే రాణించాం. కానీ ఒక వికెట్ తీసిన వెంటనే వచ్చే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాం. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయాం. అది మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఏది ఏమైనా మాకున్న పరిమిత ఆటగాళ్లతో అత్యుత్తమ కాంబినేషన్స్‌తో బాగా ఆడాం. మా ప్రదర్శన పట్ల నాకు గర్వంగా ఉంది.

వచ్చే ఏడాదికి సరైన జట్టును నిర్మిస్తాం. ఈ సీజన్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సంజు జట్టులోకి రావడం చాలా మంచి పరిణామం. అతను మా కోసం చాలా బాగా ఆడుతున్నాడు. కార్తీక్ శర్మ ఈరోజు మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ప్లేయింగ్ 12లో భాగమవ్వాల్సిన కొందరు కీలక ఆటగాళ్లను మేం ఈ సారి కోల్పోయాం.

వచ్చే ఏడాది బలంగా వస్తాం..

అలాంటి కీలక ఆటగాళ్లకు సరైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లను కనుగొనాలి. మా జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంద శాతం శ్రమను పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులు మాకు అండగా నిలిచారు. మేం హోమ్ గ్రౌండ్‌లో ఒకట్రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఆడాం. వచ్చే ఏడాది మరింత బలమైన జట్టుతో బరిలోకి దిగుతాం.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

గెలిపించిన ఇషాన్ కిషన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల‌కు 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కార్తీక్ శర్మ(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్ (26 బంతుల్లో 6 ఫోర్లతో 47) సత్తా చాటాడు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీయగా.. అకీల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ తీసారు.

Story first published: Tuesday, May 19, 2026, 0:25 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+