IPL 2026: సీఎస్‌కేలోకి ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్నర్!
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. తొడ కండరాల గాయంతో ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమైన ఆయుష్ మాత్రే స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్, ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాష్ మధ్వాల్‌ను తీసుకుంది. అతని కనీస ధర రూ. 30 లక్షలకు తీసుకున్నట్లు సీఎస్‌కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
'వేగం దూసుకొస్తోంది.. ఆకాష్ మధ్వాల్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కుటుంబంలోకి చేరాడు. తొడ కండరాల కారణంగా టోర్నీకి దూరమైన ఆయుష్ మాత్రే స్థానంలో ఆకాష్ మధ్వాల్ జట్టులోకి వచ్చాడు’అని సీఎస్‌కే ట్వీట్ చేసింది.
కెప్టెన్‌గా భారత అండర్-19 ప్రపంచ కప్ అందించిన ఆయుష్ మాత్రే.. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు అదిరిపోయే ఆరంభాలు అందించాడు. 6 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన ఆయుష్ మాత్రే ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బగా నిలిచింది.

ఆయుష్ మాత్రే స్థానంలో బ్యాటర్‌ను తీసుకోకుండా బౌలర్‌ను సీఎస్‌కే ఎంచుకుంది. డెత్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది, ఉర్విల్ పటేల్ రూపంలో ఆయుష్ మాత్రేకు బ్యాకప్ ప్లేయర్ ఉండటంతో ఆకాష్ మధ్వాల్ కొనుగోలు చేసింది.
కుడిచేతి వాట పేసర్ అయిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఇండియన్స్ తరఫున 2023, 2024 సీజన్లు ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, ఒత్తిడిలోనూ రాణించే సామర్థ్యం మధ్వాల్‌కు ఉంది. దాంతోనే అతన్ని సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది. అతని చేరికతో సీఎస్‌కే బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుందని ఆ జట్టు ఆశిస్తోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సత్తా చాటగలడని విశ్వసిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన సీఎస్‌కే.. పాయింట్స్ టేబుల్‌తో 8వ స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications