SRH ఓటమి.. విజయ గర్వం తలకెక్కితే ఇలానే ఉంటుంది!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)పోరాటం ముగిసింది. అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆరెంజ్ ఆర్మీ.. అసలు సిసలు ఎలిమినేటర్‌లో చేతులెత్తేసింది. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు.
అయితే సన్‌రైజర్స్‌పై సాధించిన ఈ విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీ వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో పాటు ట్రావిస్ హెడ్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. విజయ గర్వం తలకెక్కితే ఫలితం ఇలానే ఉంటుందని చురకలంటిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానంతరం ఇషాన్ కిషన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇంటికెళ్లి విజిల్స్ వేసుకోవాలని సీఎస్‌కే ఫ్యాన్స్‌ను అవమానించాడు. స్టేడియాన్ని త్వరగా వదిలేయాలంటూ సైగలు చేశాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ విజిల్ వేస్తూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ట్రోల్ చేశాడు.

ఈ వీడియోలను రీట్వీట్ చేస్తూ.. కావ్యమారన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌ను స్టేడియం నుంచి దొబ్బేయాలని ఇషాన్ కిషన్ సూచిస్తున్నాడని సీఎస్‌కే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మనిషికి ఎప్పుడూ బలుపు, అహంకారం ఉండొద్దని, అది వినాశానానికే కారణమని తమ కసి తీర్చుకుంటున్నారు. పొట్టోడిని పెద్దోడు కొడితే.. పెద్దోడిని పోచమ్మ కొడుతుందని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఇదే జరిగిందని మండిపడుతున్నారు. సీఎస్‌కేపై విజయంతో విర్రవీగిన సన్‌రైజర్స్ ఆటగాళ్ల తలపొగరును 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దించాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(3/54) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇషాన్ కిషన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), సలీల్ అరోరా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/58) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, సుశాంత్ మిశ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. యశ్‌రాజ్ పుంజా ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications