For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: కేకేఆర్‌కు బిగ్ షాక్.. జట్టు నుంచి కీలక వ్యక్తి ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేశారు. బ్రెండన్ మెక్‌కల్లమ్ అనంతరం 2021లో కేకేఆర్‌ హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించిన చంద్రకాంత్ పండిట్.. ఐపీఎల్ 2024 సీజన్‌ టైటిల్ అందించాడు. కానీ ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా టీమ్ మెంటార్ గౌతం గంభీర్‌కు వెళ్లింది. అతను టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో చంద్రకాంత్ పండిట్ జట్టును నడిపించాడు. కానీ ఐపీఎల్ 2025 సీజన్‌లో కేకేఆర్ దారుణంగా విఫలమైంది.

విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసుకోవడం ఆ జట్టు కొంపముంచింది. అజింక్యా రహానే సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 14 మ్యాచ్‌లకు ఐదు మాత్రమే గెలిచిన కేకేఆర్ మరో ఏడింటిలో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.

IPL 2026 Chandrakant Pandit Steps Down as KKR Head Coach

అయ్యర్ కారణంగానే..?

రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే వెంకటేశ్ అయ్యర్‌కు ఇంత ధర చెల్లించడం వెనుక చంద్రకాంత్ పండిట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ హెడ్ కోచ్‌గా వెంకటేశ్ అయ్యర్‌ ఆటను పండిట్ పర్యవేక్షించారు.ఈ కారణంతోనే అతను వెంకటేశ్ అయ్యర్‌ను భారీ ధరకు కొనుగోలు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ జోరును ఐపీఎల్ 2025 సీజన్‌లో కొనసాగించలేకపోయాడు.

పండిట్ గారూ.. వెళ్లి పోతున్నారు..

చంద్రకాంత్ పండిట్ పర్యవేక్షణలో 42 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 22 విజయాలు సాధించి 18 ఓడింది. మరో 2 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. చంద్రకాంత్ రాజీనామా నిర్ణయాన్ని కేకేఆర్ ధృవీకరించింది. ఎక్స్‌వేదికగా అతనికి వీడ్కోలు పలుకుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది.

Take a Poll

'చంద్రకాంత్ పండిట్ జట్టును వీడేందుకు సిద్దమయ్యారు. ఆయన పర్యవేక్షణలోనే కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయాన్ని అందుకునేందుకు ఆయన చేసిన కృషికి మేం కృతజ్ఞులం. ఆయన నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై చెరగని ముద్ర వేశాయి. ఆయన భవిష్యత్తు మరింత బాగుండాలని కోరుకుంటున్నాం.'అని కేకేఆర్ ట్వీట్ చేసింది.

తదుపరి కోచ్ ఎవరు..?

చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని భర్తీ చేసే కొత్త హెడ్ కోచ్ ఎవరా? అనేది కేకేఆర్ ఇంకా వెల్లడించలేదు. కానీ ఇంగ్లండ్, కేకేఆర్ మాజీ కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా కేకేఆర్ జట్టును వీడుతాడనే ప్రచారం జరుగుతుంది. అతని స్థానాన్ని ప్రస్తుత మెంటార్ డ్వేన్ బ్రావోతో భర్తీ చేయాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, July 30, 2025, 11:28 [IST]
Other articles published on Jul 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+