IPL 2026 విజేతగా ఆర్‌సీబీ.. పాపం గుజరాత్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకుంది. సమష్టి ప్రదర్శనతో అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ విజయ గర్జనతో ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్‌ను ముద్దాడింది.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. పేలవ బ్యాటింగ్‌తో టైటిల్ గెలుచుకునే సువర్ణవకాశాన్ని గుజరాత్ టైటాన్స్ చేజార్చుకుంది. ప్లే ఆఫ్స్‌లో నాలుగు మ్యాచ్‌లకు నాలుగు ఏకపక్షంగానే ముగియడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
రఫ్ఫాడించిన రసిక్ సలామ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. వాషింగ్టన్ సుందర్(37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యరు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్(3/27) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీసారు. కృనాల్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఆర్‌సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) పర్వాలేదనిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

చెలరేగిన కోహ్లీ, అయ్యర్..
154 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ దూకుడుగా తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ పోటాపడి బౌండరీలు బాదారు. కగిసో రబాడ వేసిన రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదిన ఈ జోడీ.. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టింది. దూకుడుగా ఆడిన వెంకటేష్ అయ్యర్‌ను మహమ్మద్ సిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
దేవదత్ పడిక్కల్(1) తీవ్రంగా నిరాశపర్చగా.. రజత్ పాటిదార్ ఫోర్, బౌండరీతో దూకుడు కనబర్చాడు. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో కృనాల్ పాండ్యా కూడా ఔటవ్వడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. కానీ కింగ్ కోహ్లీ.. టీమ్ డేవిడ్ సాయంతో జట్టును విజయంవైపు నడిపించాడు. ఈ క్రమంలో కోహ్లీ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
41 పరుగుల కీలక భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని అర్షద్ ఖాన్ విడదీసాడు. టీమ్ డేవిడ్(24)ను అర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. జితేష్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
గుజరాత్ కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం..
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించింది. సీజన్ ఆసాంతం రాణించిన గుజరాత్ టాప్-3 బ్యాటర్లు(గిల్,సుదర్శన్, జోస్ బట్లర్) ఈ మ్యాచ్‌లో చేతులెత్తే సారు. వాషింగ్టన్ సుందర్ అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమై ఓటమికి తల వంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications