ఆ ముగ్గుర్ని ఔట్ చేస్తే గుజరాత్ ఉత్తదే: రజత్ పాటిదార్
గుజరాత్ టైటాన్స్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చనే విషయం తమకు తెలుసని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. వారిని పవర్ ప్లేలోనే ఔట్ చేయాలనే ప్రణాళికలతోనే బరిలోకి దిగామని, తమ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేసి విజయం సాధించామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది.
ముందుగా ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో 255 పరుగుల ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌ను 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూల్చింది. విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించిన రజత్ పాటిదార్(33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 నాటౌట్) ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయానంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు.
అద్భుతమైన మ్యాచ్..
'ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్. మా బ్యాటర్ల ఆధిపత్యం అమోఘం. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు బంతిని బాదారు. వాస్తవానికి ఇలా ఆడాలని ఎలాంటి ప్లాన్ చేయలేదు. కానీ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్దంగా ఉండాలని అనుకున్నాం. అది మా ప్రతి బ్యాటర్‌లోనూ కనిపించింది. మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశంలో కూడా మేం దీని గురించే మాట్లాడుకున్నాం.
మైదానంలో దూకుడుతో కూడిన బాడీ లాంగ్వేజ్, అటాకింగ్ మైండ్‌సెట్‌తో ఆడాలని నిర్ణయించుకున్నాము. ఇది క్వాలిఫైయర్ 1 లాంటి ఒక పెద్ద వేదిక.. ఇలాంటి మ్యాచ్‌లో మేము ఆడిన తీరు, మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన విధానం నిజంగా అద్భుతం.

నా స్టైలే ఇంత..
నా బ్యాటింగ్ శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో పిచ్ ఎలా ప్రవర్తిస్తోంది.. బంతి ఎలా వస్తోంది అనేది గమనించడానికి నేను ఒక 8-10 బంతులు తీసుకుంటాను. ఆ తర్వాత, మ్యాచ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నాకు ఓ క్లారిటీ వస్తుంది. ఇక పిచ్ ఎలా ఉన్నా నేను భయపడను. బౌలర్‌ను ఎప్పుడూ ఒత్తిడిలోకి నెట్టడమే నాకు ఇష్టం.
నిజం చెప్పాలంటే.. ఈ పిచ్‌పై బంతి కిందకు వచ్చి భారీ సిక్సర్లు కొట్టడం అంత సులువు కాదు. ఎందుకంటే పిచ్‌లో చాలా మంచి బౌన్స్ ఉంది. మా బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. ఎక్కువగా స్టంప్స్ లైన్‌పైనే బంతులు వేశారు. అది మాకు బాగా సహాయపడింది.
టాప్-3ని ఔట్ చేస్తే..
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన తీరును చూస్తే, వారి టాప్-3 బ్యాటర్లే ఆ జట్టుకు ప్రధాన బలం. కాబట్టి పవర్‌ప్లేలోనే వారిని ఔట్ చేయాలనే విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. అనుకున్నట్లే అది వర్కవుట్ అయింది.
ఫైనల్లో రోమారియో ఎలా బౌలింగ్ చేస్తాడో పరీక్షించేందుకు అతన్ని ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాం. ఫైనల్స్‌కు ముందు మాకు తగిన విశ్రాంతి లభిస్తోంది. ఇక నేరుగా ఫైనల్స్‌లో చూసుకుంటాం.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications