Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలర్లు బతకాలంటే.. ఇక బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలి: పాట్ కమిన్స్

బ్యాటర్లు రాజ్యమేళుతున్న టీ20 క్రికెట్‌లో బౌలర్లు నిలదొక్కుకోవాలంటే బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ సూచించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారుతుండటంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. శనివారం జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించగా.. రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాట్ కమిన్స్.. పరుగుల వరదపై తనదైన శైలిలో స్పందించాడు. గాయంతో సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

రీఎంట్రీ సంతోషంగా ఉంది..

'సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఎలా ఆడుతానో అనే చిన్న సందేహం వెంటాడింది. కానీ నా ప్రిపరేషన్ బాగుంది. 10 ఏళ్ల క్రితం నేను కెరీర్ ప్రారంభించినప్పటి కంటే.. ఇప్పుడు నాకున్న అనుభవంతో త్వరగా టచ్‌లోకి వచ్చాను.

IPL 2026 Bowlers Need to Focus on Batting Pat Cummins Jokes After SRH Successfully Chase 228 Against RR
Photo Credit: screen grab for JioHotstar

బ్యాటర్ల హవా నడుస్తున్నప్పుడు బౌలర్లుగా మేం కూడా బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలేమో(నవ్వుతూ). ఇది అద్భుతమైన క్రికెట్. ఈ మ్యాచ్‌ల్లో స్కోర్లు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే.. ఒకటి రెండు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా.. మళ్ళీ పుంజుకుని మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం లభిస్తుంది. ప్రఫుల్ హింగే విషయంలో ఇదే జరిగింది. టీ20 క్రికెట్ సాగుతున్న తీరు ఇదే.. ఇది చాలా సరదాగా ఉంది.

ఇషాన్ కెప్టెన్సీ అద్భుతం..

నా గైర్హాజరీలో ఇషాన్ కిషన్ అద్భుతంగా జట్టును నడిపించాడు. యువ బౌలర్లతో కలిసి అసాధారణమైన ఫలితాలు రాబట్టాడు. అయితే మా దగ్గర హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా ఉన్నారు. మా డగౌట్ అంతా ప్రతిభావంతులైన బౌలర్లతో నిండి ఉంది. యువ ఆటగాళ్లు తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం గొప్ప విషయం.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ అనంతరం మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. స్కోరు 250 దాటి ఉంటే మాకు కష్టమయ్యేది. కానీ 220 అనేది ఛేదించదగ్గ స్కోరే. పవర్‌ప్లేలో మంచి స్కోరు సాధిస్తే.. ఆ తర్వాత ఓవర్‌కు 10 పరుగులు చేయడం ఇషాన్ కిషన్ వంటి వారికి పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం మా జట్టు చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇది నిజంగా మంచి విజయం.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 26, 2026, 6:00 [IST]
Other articles published on Apr 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+